Keerthy Suresh: ఆఫర్ల కోసం కీర్తి సురేష్ ఆ ఒక్క పని చేస్తుందా?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి పేరు ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్(Keerthy Suresh) ఒకరు కాగా దసరా సినిమాతో ఈ బ్యూటీ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సంగతి తెలిసిందే. మరో 72 గంటల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా కీర్తి సురేష్ అభిమానులు సైతం ఈ సినిమ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారు.

అయితే కీర్తి సురేష్ కు సినిమా ఆఫర్లు పెరగాలంటే సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి కూడా ఆమె ఓకే చెబితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోయిన్లు సైతం సీనియర్ స్టార్స్ కు జోడీగా నటించడానికి ఓకే చెబుతున్నారు. మరి కీర్తి సురేష్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించగా మహానటి మినహా ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలేవీ ఆకట్టుకోలేదు.

కీర్తి సురేష్ నటించిన కొన్ని సినిమాలు థియేటర్లలో ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలీదు. తమిళంలో కూడా కీర్తి సురేష్ కు మంచి పేరు ఉన్నా టాప్ హీరోలకు జోడీగా ఆఫర్లు రావడం లేదు. నాని, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన నేను లోకల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

నాని, కీర్తి సురేష్ కాంబో కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోగా నాని ఆ జాబితాలో చేరతారో లేదో చూడాల్సి ఉంది. నాని, కీర్తి సురేష్ క్రేజ్ ను రెట్టింపు చేసేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus