స్టార్ హీరోయిన్స్ ను ఇరికించేసిన కీర్తి సురేష్..!

‘మహానటి’ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. ఉత్తమ నటి కేటగిరిలో నేషనల్ అవార్డుని కూడా కైవసం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తెలుగులో ఇంకా అందరి స్టార్ హీరోలతోనూ సినిమాలు చెయ్యలేదు కానీ తమిళంలో మాత్రం దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించేసింది ఈ బ్యూటీ. ఈమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రం జూన్ 19న నేరుగా ఓటిటిలో విడుదల కాబోతుంది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో కూడా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీకి వందల కోట్లలో నష్టం వచ్చింది. దీంతో నటీనటుల పారితోషికాల్లో కోతలు విధించాలని నిర్మాతలు కూడా డిసైడ్ అయ్యారు. అయితే దీనికి హీరో, హీరోయిన్ల నుండీ మద్దతు లభించడం లేదని టాక్. ఈ క్రమంలో కీర్తి సురేష్ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి రెడీ అయినట్టు ప్రచారం జరుగుతుంది.

దీంతో ‘నిజంగా సావిత్రిగారు లాగానే గొప్ప మనసు చాటుకుంది’ అంటూ ఈమె పై ప్రసంసలు కురుస్తున్నాయి. కానీ ఈమె తీసుకున్న ఈ డెసిషన్ వల్ల టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సమస్య తెచ్చిపెట్టినట్టు తెలుస్తుంది. విషయం ఏమిటంటే.. వాళ్ళ తరువాతి సినిమాలకు పారితోషికం తగ్గించుకోవాలని దర్శక నిర్మాతలు ఒత్తిడి చేస్తున్నారట. అందుకు ఉదాహరణగా కీర్తి సురేష్ పేరుని వారు చెబుతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus