ఇక బయోపిక్ చేయనని స్పష్టం చేసిన కీర్తి సురేష్

అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీలో సావిత్రిగా కీర్తి సురేష్ అమోఘమైన నటనను ప్రదర్శించింది. మరో పదేళ్ళపాటు కీర్తి పేరు చెప్పగానే సావిత్రి రోల్ ముందుగా గుర్తుకువస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రం తమిళంలోనూ రిలీజ్ అయి పెద్ద సక్సస్ సాధించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు మాదిరిగా.. ఒకే సినిమాతో రెండు పరిశ్రమల్లో క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళ దర్శక నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్ లో నటించమని కోరారు. ఆమె మాత్రం సున్నితంగా నో చెప్పి.. విక్రమ్ తో సామి 2 (లక్ష్మీనరసింహ స్వామి సీక్వెల్), విశాల్ తో సండా కోజి 2 (పందెం కోడి సీక్వెల్), విజయ్ తో థళపతి 62 సినిమాలకు ఓకే చెప్పింది.

బయోపిక్ లో లీడ్ క్యారక్టర్ గా అవకాశం వస్తే.. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు వస్తుంది కదా… ఎందుకు కాదని చెప్పిందని ఆమెనే ప్రశ్నించగా ఇలా సమాధానం ఇచ్చింది. “మహానటి ఎంత పేరు తెచ్చిపెట్టిందో మీకు తెలుసు. అందుకు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి రోల్ అడిగినా చేయలేనని చెప్పేసాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో కూడా నటించనన్నాను. ఇక ఏ బయోపిక్ చేయను ” అని క్లారిటీగా చెప్పింది. కీర్తి అలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె అభిమానులు బాధపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus