స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) 2024లో ఆంటోనీ తటిల్ అనే బిజినెస్ మెన్..ని వివాహం చేసుకుంది. వీరిది కులాంతర వివాహం..! అలాగే వీరి మతాలు కూడా వేరు. ఆంటోనీ క్రిస్టియన్, కీర్తి సురేష్ హిందూ.అయినప్పటికీ ప్రేమలో పడ్డారు. దీంతో వీరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరేమో అని కీర్తి భయపడిందట. 15 ఏళ్ళ వీరి ప్రేమకి.. పెళ్ళి బంధంతో శుభం కార్డు వేసుకోగలిగారు.
ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ…. “15 ఏళ్లు నుండి ప్రేమలో ఉన్నాం. కానీ మా పెళ్లి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని ఊహించలేదు. నేను ఆంటోనీ ఖచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో అని మొదటి నుండి అనుకునేదాన్ని.ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి అంగీకరించరు అనిపించేది. కానీ మా ప్రయత్నం మొదట చేయాలి కాబట్టి.. చెప్పి చూద్దాం అనుకున్నాం.
మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి అంగీకరించారు. అందువల్ల మా పెళ్ళి ఘనంగా జరిగింది. నేను కలలో కూడా అనుకోలేదు. కానీ మా కోరిక తీరింది. అందుకే మా పెళ్ళి వేడుకలో నేను, ఆంటోనీ ఎమోషనల్ అయ్యాం” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.అయితే కీర్తి సురేష్ సక్సెస్ఫుల్ హీరోయిన్. స్టార్ హీరోయిన్. కాబాట్టి.. ఆమె మాట ఇంట్లో చెల్లుతుంది. చెల్లింది కూడా..!
పైగా కీర్తి భర్త ఆంటోని కూడా రిచ్ కిడ్. కానీ సమాజంలో మిగిలిన వారి లైఫ్లో ఇలా జరగాలని ఉండదు కదా. జీవితంలో మనం ఏం పొందాలన్నా.. సక్సెస్ ముఖ్యం అని కీర్తి లైఫ్ ఆధారంగా చెప్పొచ్చు.