Keerthy Suresh: ‘సర్కారు వారి’ కొత్త ‘పాట’: కీర్తిలో ఈ యాంగిల్ కూడా ఉందా..!

కెరీర్ ప్రారంభం నుండీ కీర్తి సురేష్ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వచ్చింది. తన పాత్రకు ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లోనే నటిస్తూ వచ్చింది. ‘నేను శైలజ’ ‘నేను లోకల్’ ‘రెమో’ ‘మహానటి’ ‘భైరవ’ ‘సర్కార్’.. ఇలా ఏ సినిమాలో చూసుకున్నా సరే ఆమె గ్లామర్ షో చేసింది లేదు. పైగా ‘మహానటి’ టైంలో కీర్తి సురేష్ కాస్త బొద్దుగా తయారయ్యింది కూడా..! దీంతో కొన్ని విమర్శలు కూడా ఆమె ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ ట్రోల్స్ ను ఆమె సీరియస్ గా తీసుకుని సర్జరీలు చేయించుకుని సన్నగా తయారయ్యింది.

అయితే ఆమె సన్నబడిన తర్వాత ‘కీర్తి మరీ చిన్నపిల్లలా ఉంది’ అనే కామెంట్లు కూడా వినిపించాయి. అంతేకాకుండా వెయిట్ లాస్ అయిన తర్వాత కీర్తి సురేష్ నటించిన ‘మన్మధుడు 2’ ‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ ‘పెద్దన్న’ ‘గుడ్ లక్ సఖి’ వంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.అతిథి పాత్ర చేసిన ‘జాతి రత్నాలు’ హిట్ కాగా , నితిన్ తో చేసిన ‘రంగ్ దే’ చిత్రం యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసింది. అయితే గత నెలలో వచ్చిన ‘సర్కారు వారి పాట’ చిత్రం కీర్తి సురేష్ ప్లాప్ లకి బ్రేకులు వేసిందనే చెప్పాలి.

నిజానికి ఈ చిత్రానికి కూడా మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఆడియన్స్ టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి వెళ్లారు. ఈ మూవీలో కళావతి పాత్రలో కీర్తి సురేష్ మంచి నటన కనపరిచింది. చాలా కాలం తర్వాత ఇలాంటి బబ్లీ రోల్ చేసి యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాదు ఇటీవల ‘సర్కారు వారి పాట’ లో జోడించిన ‘మురారి వా’ పాటలో కీర్తి గ్లామర్ బాగా హైలెట్ అయ్యింది.

ఆమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అనే గ్లామర్ షో చేసింది. సోషల్ మీడియాలో కీర్తి సురేష్ గ్లామర్ గురించి ఎక్కువ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ మూవీతో ఆమె గ్లామర్ రోల్స్ కూడా చేయగలదు అని ప్రూవ్ అయ్యింది. కాకపోతే ఈ పాట నిన్న విడుదలైన ఓటీటీ వెర్షన్లో లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus