Keerthy Suresh: కీర్తి సురేశ్‌ లాంగ్‌ టైమ్‌ ప్రేమ విషయం..వాళ్లకు మాత్రమే తెలుసట..!

కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) ప్రేమలో ఉందని, అతనినే పెళ్లి చేసుకుంటుంది అని ఇలా వార్తలు వచ్చాయో లేదో ఆమె పెళ్లిని అనౌన్స్‌ చేసేసింది, పెళ్లి చేసేసుకుంది కూడా. ఈ నేపథ్యంలో ప్రేమ – పెళ్లి ఇంత వేగంగా జరిగిపోయాయా అనే చర్చ సోషల్‌ మీడియాలో ఆ మధ్య జరిగింది. అయితే వాళ్ల ప్రేమ వ్యవహారం ఇప్పటిది కాదు. 15 ఏళ్ల క్రితమే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ విషయాన్ని కీర్తినే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Keerthy Suresh

ఓ సందర్భంలో కుటుంబంతో కలసి కీర్తి రెస్టారంట్‌కు వెళ్లిందట. అక్కడకు ఆంటోనీ కూడా వచ్చారట. ఆ సమంలో మాట్లాడే ప్రయత్నం చేసినా కుటుంబ సభ్యులు ఉండటంతో చేయలేదట. దీంతో ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్‌ చేయమని కీర్తి సవాలు విసిరిందట. అప్పుడు ఆంటోనీ ప్రపోజ్‌ చేశారట. అలా మొదలైన వారి ప్రేమ ప్రయాణం 2016 నుండి మరింత బలపడిందట. అలా ఇప్పుడు పెళ్లి అయింది అని కీర్తి చెప్పింది. తమ పెళ్లి ఓ కలలా ఉందని, వివాహం కోసం ఎప్పటినుండో కలలు కన్నామని చెప్పిన కీర్తి..

ఆంటోనీ తన కంటే ఏడేళ్లు పెద్ద అని చెప్పింది. ఆరేళ్ల నుండి ఖతార్‌లో ఉంటున్నడని, తన కెరీర్‌కు సపోర్ట్‌ ఇస్తాడని చెప్పింది. పెళ్లి ఫిక్స్‌ అయ్యేవరకు మా ప్రేమను ప్రైవేటుగానే ఉంచాలని నిర్ణయించుకున్నామని.. అందుకే బయట ఎవరికీ చెప్పలేదు అని చెప్పింది. ఇక తమ ప్రేమ సంగతి ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే తెలుసని చెప్పింది. ఆ లిస్ట్‌లో సమంత (Samantha) , విజయ్‌ (Vijay Thalapathy), అట్లీ (Atlee Kumar) , ప్రియా అట్లీ (Priya Atlee), ప్రియదర్శన్‌ (Priyadarshan), ఐశ్వర్యలక్ష్మి (Aishwarya Lekshmi) ఉన్నారు అని చెప్పింది.

ఇక తాము ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నా 2017లో మొదటిసారి విదేశాలకు కలిసి వెళ్లామని, రెండేళ్ల క్రితమే సోలో ట్రిప్‌కు వెళ్లామని చెప్పింది. 2022లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని కీర్తి చెప్పింది. ఇక సినిమా ప్రచారంలో పసుపు తాడుతోనే వస్తున్నారుగా అంటే.. పెళ్లి అయిన దగ్గరి నుండి పసుపుతాడుతోనే తిరుగుతున్నా అని, అది చాలా పవిత్రమైనది, శక్తిమంతమైనదని చెప్పింది కీర్తి. మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారు గొలుసులోకి మార్చుకుంటా అని కూడా చెప్పింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus