అర్ధరాత్రి వేళ మీడియా సభ్యులతో కీర్తి సురేష్ మంతనాలు

సాధారణంగా పొలిటీషియన్స్ & బిజినెస్ మ్యాన్స్ మీడియాతో అర్ధరాత్రుళ్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొంటుంటారు. కానీ.. విచిత్రంగా ఈసారి హీరోయిన్ కీర్తి సురేష్ మీడియాతో మిడ్ నైట్ మీటింగ్స్ లో పాల్గొంది. ఆవిడేమీ రాజకీయాల్లోకి రావడం కోసం ఈ మీటింగులు ఏర్పాటు చేసుకోలేదండోయ్. ఇక్కడ మేటర్ ఏంటంటే.. కీర్తి సురేష్ వరుస షూటింగ్స్ కారణంగా విపరీతమైన బిజీగా ఉంది. అందువల్ల తన తాజా చిత్రం “పందెం కోడి 2” ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనలేకపోతుంది. మొన్న “పందెం కోడి 2” ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైద్రాబాద్ వచ్చిన కీర్తి సురేష్ మరుసటి రోజు హైద్రాబాద్ లోనే ఉండి న్యూస్ పేపర్స్ & చానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చే టైమ్ లేకపోవడంతో ఆరోజు రాత్రి కొందరు సెలక్టెడ్ న్యూస్ పేపర్ రిపోర్టర్స్ ని రాత్రి 11, 12 గంటల టైమ్ లో ఆఫీస్ కి పిలిపించి మరీ కీర్తి సురేష్ పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇప్పించారట. ఈ విషయం కాస్త లేట్ గా వెలుగులోకి వచ్చి.. అమ్మడి డెడికేషన్ లేవల్శ్ ను తెగ పొగిడేస్తున్నారు.

ఇకపోతే.. కీర్తి సురేష్ కు “మహానటి” అనంతరం ఆస్థాయి పాత్ర మళ్ళీ ఇప్పటివరకూ దొరకలేదు. ఇకపై దొరుకుతుందో లేదో కూడా తెలీదు. సో, వచ్చిన పాత్రల్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ లతో అలరిస్తుంది కీర్తి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక అయిదు సినిమాలున్నాయి. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యాక మరో లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్ చేయాలని ప్లాన్ చేస్తుందట కీర్తి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus