కీర్తి సురేష్ సినిమా పై మరో దెబ్బ పడింది..!

‘మహానటి’ కీర్తి సురేష్ న‌టించిన ‘మిస్ ఇండియా’ చిత్రం ఈమధ్యనే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. న‌రేంద్ర‌నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని… ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్’ బ్యాన‌ర్‌ పై మ‌హేష్ కోనేరు నిర్మించాడు. ‘పెంగ్విన్’ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కాబట్టి ‘మిస్ ఇండియా’ అయినా హిట్ అయితే చాలు అని కీర్తి అభిమానులు ఆశించారు. కానీ ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్రమోషన్ కూడా పెద్దగా చెయ్యకపోవడం మరో మైనస్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం పై కాపీ ఆరోపణలు కూడా వస్తుండడం పెద్ద చర్చకు దారితీస్తుంది.

వివరాల్లోకి వెళితే… ఓ సాధార‌ణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అమెరికాలో ఛాయ్ బిజినెస్‌ని ప్రారంభించి గొప్ప స్థాయికి ఎలా ఎదిగింది అన్న‌ది `మిస్ ఇండియా` థీమ్. నిజానికి ఇది ఓ అమెరిక‌న్ యువ‌తి జీవిత చరిత్రతో తెరకెక్కిన సినిమా అని తెలుస్తుంది.ఇండియ‌న్ ఛాయ్‌ని ‘భ‌క్తి ఛాయ్’ పేరుతో ఆమె అమెరికా దేశమంతా పాపులర్ చేసింది.ఆ యువతి పేరు బ్రూక్ ఎడ్డీ అట.ఆమె ఒకానొక సందర్భంలో నార్త్ ఇండియా మొత్తం ట్రావెల్ చెయ్యాల్సి వచ్చిందట. అప్పుడు ఆమెకు ఛాయ్ అంటే ఇష్టం పెరిగింది. దానినే తన బిజినెస్‌గా మార్చుకుని..

అమెరికాలో 2018 వ‌ర‌కూ 35 మిలియ‌న్‌ డాలర్లను సంపాదించి ఉన్నత స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. 2007 వ సంవత్సరంలో ఛాయ్ బిజినెస్‌ ను ప్రారంభించిన ఆమె .. ప‌ద‌కొండేళ్ల‌లోనే ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకోవడం ఓ రికార్డ్ అనే చెప్పాలి. ఆమె కథనే కాస్త అటు.. ఇటు చేసి `మిస్ ఇండియా` గా రూపొందించారని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అసలే సినిమాకి మంచి టాక్ రాలేదు అనుకుంటుంటే.. ఇప్పుడు కాపీ ఆరోపణలు కూడా వస్తుండడం చిత్ర యూనిట్ సభ్యులను టెన్షన్ పెడుతుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus