Keerthy Suresh: లిప్ లాక్ సీన్స్ కి రెడీ అయిన మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్!

హీరోయిన్లు అన్నాక గ్లామర్ షో చేయాల్సిందే. లేదంటే తర్వాత వాళ్ళకి లీడ్ రోల్స్ రావు, వచ్చినా స్టార్ డం రాదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. కానీ అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి హీరోయిన్లు ఆ అభిప్రాయాన్ని మార్చేశారు. గతంలో కూడా కొంతమంది హీరోయిన్లు వీరిలానే గ్లామర్ షోకి దూరంగా ఉండి.. స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న సందర్భాలు ఉన్నాయి.కానీ అప్పటి రోజులు వేరు. ఇప్పటి రోజులు వేరు.

ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే.. దేనికి కూడా హద్దులు పెట్టుకోకూడదు. ఈ విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ కూడా గ్రహించింది అంటే.. పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకోవచ్చు. మొదట్లో ఆమె గ్లామర్ షోకి దూరంగా ఉండేది. కానీ ఆఫర్లు తగ్గేసరికి ‘రౌడీ బాయ్స్’ సినిమాలో లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ కి ఓకే చెప్పేసింది. త్వరలో రాబోతున్న ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో ఈమె అంతకు మించి రెచ్చిపోయింది అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇక ఇప్పుడు కీర్తి సురేష్ (Keerthy Suresh)  వంతు వచ్చింది. ‘మహానటి’ వంటి సినిమాల్లో ఎంత పద్ధతైన యాక్టింగ్ చేసి నేషనల్ అవార్డు కొట్టినా.. అలాంటి పాత్రలే చేస్తుండటంతో ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి. దీంతో ఆమె కూడా రూటు మార్చింది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఆమె గ్లామర్ షోకి రెడీగా ఉన్నట్లు హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఆమెకు ఓ బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అందులో ఓ లిప్ లాక్ సీన్ ఉందట. దానికి కీర్తి సురేష్ మొదట నో చెప్పినా, తర్వాత మనసు మార్చుకుని ఓకే చెప్పేసినట్టు టాక్

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus