Keerthy Suresh: హీరోల రేంజ్ లో బీచ్ లో జీప్ సందడి చేసిన కీర్తి సురేష్!

మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె చివరిగా దసరా సినిమా ద్వారా హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అనంతరం చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లెలి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తరచూ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించినటువంటి విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా తన సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆదివారం ఈమె చెన్నై బీచ్ లో పెద్ద ఎత్తున సందడి చేశారని తెలుస్తుంది మహేంద్ర థార్ కారును బీచ్ లో ఎంతో అద్భుతంగా డ్రైవ్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. ఇలా ఈ కార్ డ్రైవింగ్ కి సంబంధించినటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది. ఇది చూసినటువంటి అభిమానులు వామ్మో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఏంటి హీరోల రేంజ్ లో ఇలా బీచ్ లో డ్రైవ్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సాధారణంగా మనం సినిమాలలో చేజ్ చేసే సన్నివేశాలను చూస్తూ ఉంటాము. అలాంటి సన్నివేశాలను తలపిస్తూ ఈమె బీచ్ లో మహేంద్ర కారును డ్రైవ్ చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే తెలుగులో ఇప్పటివరకు కొత్త సినిమాలను ప్రకటించకపోయిన తమిళంలో మాత్రం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus