Keerthy Suresh: స్టార్‌ హీరోయిన్‌ థ్యాంక్స్‌ చెప్పిన కీర్తి సురేశ్‌.. నీవల్లే ఇదంతా అంటూ.!

‘బేబీ జాన్‌’ (Baby John) సినిమా ఎలా ఉంది? విజయం అందుకుందా? లేదా? అనే విషయాలు పక్కనపెడితే కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) అయితే బాలీవుడ్‌లో లాంచ్‌ అయింది. సినిమా ఫలితం ఆమెకు ఉపయోగపడుతుందా లేదా అనే చర్చ ఓవైపు నడుస్తున్న ఈ సమయంలో ఆమె ఓ స్టార్‌ హీరోయిన్‌కు ధన్యవాదాలు చెప్పింది. ఇప్పుడు ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కీర్తి సురేశ్‌ నుండి థ్యాంక్స్‌ అందుకున్న హీరోయిన్‌ ఇంకెవరో కాదు.. సమంత.

Keerthy Suresh

‘తెరి’ సినిమా రీమేక్‌ ‘బేబీ జాన్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేశ్‌. మాతృకలో ఆ పాత్రలో నటించిన కథానాయిక సమంత (Samantha). ‘బేబీ జాన్‌’ సినిమాలో కూడా ఆమెనే నటిస్తుంది అని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆమె స్థానంలో కీర్తి సురేశ్‌ను తీసుకున్నారు. అదే సమయంలో సమంత తన సోషల్‌ మీడియాలో ‘నువ్వు తప్ప ఈ పాత్రను మరెవ్వరూ చేయలేరు’ అని కీర్తిని ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టింది.

ఇప్పుడు ఆ పోస్టును ప్రస్తావిస్తూనే కీర్తి సురేశ్‌.. సమంతకు థ్యాంక్స్‌ చెప్పింది. ‘బేబీ జాన్‌’ సినిమా హిందీలో రీమేక్‌ చేయాలని ప్లాన్స్‌ గురించి వినగానే ఆ పాత్రకు కీర్తినే కరెక్ట్‌ అని సమంత చెప్పిందట. ఈ విషయాన్ని కీర్తి తాజాగా చెబుతూ తమిళంలో ఆమె పోషించిన పాత్రను హిందీలో నేను చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం మర్చిపోలేని అనుభూతి. ఈ విషయంలో సమంతకు కృతజ్ఞతలు అని చెప్పింది కీర్తి.

‘తెరి’ (Theri) సినిమాలో సమంత నటనంటే నాకు చాఆ ఇష్టం. ఈ రీమేక్‌ కోసం సమంత నా పేరు చెప్పగానే తొలుత భయపడ్డాను. కానీ, ఆమె నాకు మద్దతు ఇచ్చింది. చిత్రబృందం నా పేరు అనౌన్స్‌ చేయగానే ‘నువ్వు తప్ప ఈ పాత్రను మరెవ్వరూ చేయలేరు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసింది. అది చూశాక నాలో నమ్మకం పెరిగింది. ఆ ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొన్నా. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే సినిమ పూర్తి చేశా అని చెప్పింది. కీర్తి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus