Keerthy Suresh: యాంకర్ గా కనిపించబోతున్న కీర్తి సురేష్

ఒకప్పుడు సినిమా తారలు కేవలం వెండితెరపై మాత్రమే ఎక్కువగా కనిపించే వారు. ఇంకా ఈ రోజుల్లో మాత్రం అందుకు భిన్నంగా బుల్లితెరపై కూడా ఎక్కువగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రియాలిటీ షోలు టాక్ షోలతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్నారు. ఇక త్వరలో కీర్తి సురేష్ కూడా ఒక షో ద్వారా స్పెషల్ గా దర్శనమివ్వనుందట. పూర్తి స్థాయి యాంకర్ గా కాకుండా ఆమె ఒక హోస్ట్ గా కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కీర్తి సురేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో చాలా బలమైన పాత్ర ఉంటుందని విడుదల కాకముందే చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలన్నీ కూడా చాలా వరకు ఏదో ఒక విధంగా కొత్తగా ఉంటాయి. ఇక ఇప్పుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్ మొదలు పెట్టబోయే షోలో కీర్తి సురేష్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించనుందట. ప్రత్యేకంగా గేమ్ ఆడించడమే కాకుండా వారితో పర్సనల్ గా ఇంటర్వ్యూలు కూడా చేస్తుందట.

ఇంటర్వ్యూ ఒకేసారి నాలుగు భాషల్లో ప్రసారమయ్యే లో కూడా టీవీ ఛానల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత ఎక్కువగా పెద్ద సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమాలో కూడా సోదరి పాత్రలో నటిస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus