‘ప్రభాస్’కు ప్రేమతో…కెన్యా!!!

  • May 16, 2016 / 01:33 PM IST

టాలీవుడ్ యువ హీరో ప్రభాస్ స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. బాహుబలి ముందు, బాహుబలి తరువాత అన్నట్లుగా ఉంది ప్రభాస్ ఇమేజ్. అయితే ఇదే క్రమంలో ప్రభాస్ కు వర్ల్డ్ వైడ్ గుర్తింపు లభించడం విశేషం. ఇదిలా ఉంటే… ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగి తెలిపోయే విషయం ఒకటి తాజాగా బయటకు వచ్చింది…ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే….టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం…‘బాహుబలి’ పార్ట్ టు షూటింగ్ కు వేసవి శెలవలు ప్రకటించటంతో ప్రభాస్ తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి కెన్యా వెళ్లాడు.

అయితే అక్కడ అనుకోని స్వీట్ షాక్ ఇచ్చింది కెన్యా ప్రభుత్వం. ఇంతకీ ఏం జరుగిందంటే…ప్రభాస్ ను అభినందిస్తూ కెన్యా దేశానికి సంబంధించిన గవర్నర్ ఒక లెటర్ పంపడం జరిగింది అని తెలుస్తుంది. ఆ లెటర్ సారాంశం ఇదే….అక్కడ రెండు వారాలు బాగా ఎంజాయ్ చేసిన మన కుర్ర హీరో…. ఆ దేశంలోని ప్రముఖ ఫారెస్ట్ ప్రాంతమైన మాసాయ్ మారా (మ్యాయసేయీ మరా) కు ప్రభాస్ వెళ్లడట…ఇక ఈ ప్రాంతం ఆఫ్రికాలోని అతి పెద్ద వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్. చాలా అద్బుతమైన ప్రాంతంగా ఈ ఫారెస్ట్ కు పేరుంది. అయితే  ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు….ఇక ఈ ప్రాంతంలో సింహాలు, చిరుతపులలు వంటి వైల్డ్ జంతువుల తాకిడి ఎక్కువ…..ఇదిలా ఉంటే దాదాపు వారం రోజుల పాటు ప్రభాస్ అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాడని తెలుస్తుంది. ఇక ఆయన రాకకు మెచ్చి ఇండియా నుంచి ఒక ప్రముఖ సెలెబ్రెటీ తమ అరణ్య ప్రాంతానికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అక్కడి గవర్నమెంట్ ప్రభాస్ కు ఎప్రిషియేషన్ లెటర్ పంపడమే కాకుండా తమ ప్రాంతానికి మరోసారి రమ్మని అక్కడ షూటింగ్ లు కూడ చేసుకోమని అక్కడి ప్రభుత్వం ఉత్తరం వ్రాసింది అని తెలుస్తోంది. ఏది ఏమైనా…మన తెలుగు వారికి అక్కడ అంతటి గౌరవం లభించడం నిజంగా గర్వ కారణం అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus