KGF2 Trailer: నాతో దుష్మనీ ఎవ్వరూ తట్టుకోలేరంటున్న రాకీభాయ్!

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్1 2018 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో ప్రశాంత్ నీల్, యష్ పేర్లు మారుమ్రోగాయి. కన్నడ సినిమాలలో గతంలో ఏ సినిమా సాధించని స్థాయిలో కేజీఎఫ్ ఛాప్టర్1 కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. కేజీఎఫ్ ఛాప్టర్1 కు కొనసాగింపుగా తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్2 ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

బర్త్ డే బాయ్ రామ్ చరణ్ చేతుల మీదుగా కేజీఎఫ్-2 తెలుగు వెర్షన్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు విడుదలైంది. ట్రైలర్ లో రామకృష్ణ పవన్ అలియాస్ రాకీభాయ్ పాత్రలో యష్ అదరగొట్టారు. ప్రకాష్ రాజ్ “రక్తంతో రాసిన కథ ఇదీ.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం.. ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే అడుగుతుంది” అనే డైలాగ్ చెప్పి ట్రైలర్ కు హైలెట్ గా నిలిచారు.

రవీనా టాండన్ రాజకీయ నాయకురాలి పాత్రలో కొత్త లుక్ తో ఆకట్టుకున్నారు. సంజయ్ దత్ అధీరా పాత్రలో ట్రైలర్ లో పవర్ ఫుల్ గా కనిపించారు. సంజయ్ దత్ అధీరా పాత్ర లుక్ భయంకరంగా ఉండటంతో పాటు సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రావు రమేష్ ట్రైలర్ లో కొన్ని సెకన్ల పాటు కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ట్రైలర్ లో యష్ రాకీభాయ్ పాత్రలో లేట్ గా ఎంట్రీ ఇచ్చినా వయొలెన్స్ నన్ను ఇష్టపడుతోందని నేను దూరం పెట్టలేనంటూ ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. నాతో ఎవ్వడూ దుష్మనీ ఎవ్వరూ తట్టుకోలేరంటూ ట్రైలర్ లో తన నటనతో యష్ మెప్పించారు.

ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో కేజీఎఫ్ ఛాప్టర్1 ను మించిన సక్సెస్ ను అందుకోవడం గ్యారంటీ అని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఫస్ట్ పార్ట్ ను మించి సక్సెస్ సాధించేలా కేజీఎఫ్ ఛాప్టర్2 ను నిర్మించారు. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ గా కేజీఎఫ్2 ట్రైలర్ ఉంది. కేజీఎఫ్2 లో యష్ మరింత స్టైలిష్ గా కనిపించారు. కేజీఎఫ్2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని చెప్పవచ్చు.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus