కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కె.జి.ఎఫ్’. ఇటీవల భారీ పోటీ నడుమ విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం నమోదుచేసింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జీరో’ కంటే కూడా ఎక్కువ కలెక్షన్లను రాబతుండడం గమనార్హం. ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుదలైనప్పటికీ ‘జీరో’ నాలుగు రోజుల్లో 69 కోట్లు కలెక్ట్ చేయగా .. ‘కె.జి.ఎఫ్’ 75 కోట్ల కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కంటెంట్ ఉన్నవాడే బాద్ షా అనే రేంజ్ లో ‘కె.జి.ఎఫ్’ కలెక్షన్లు రోజు రోజుకి పెరుగుతుంటే.. ‘జీరో’ కలెక్షన్లు రోజు రోజుకి తగ్గుతుండడం గమనించ తగ్గ విషయం.
ఇక తెలుగులో కూడా ‘పడి పడి లేచె మనసు’ ‘అంతరిక్షం’ వంటి క్రేజీ చిత్రాల గట్టి పోటీ నడుమ విడుదలైన ‘కె.జి.ఎఫ్’సి చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్ర తెలుగు హక్కులని దాదాపు 5 కోట్లకు ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి దక్కించున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం 6 కోట్ల వరకు షేర్ ను రాబట్టి లాభాలు పంటలో నిలబెట్టడం విశేషం. ఇక ఫుల్ రన్లో ఈ చిత్రం దాదాపు 10 కోట్ల వసూళ్ళు రాబట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఆల్రెడీ 100 గ్రాస్ ను దాటేసిందంట.
ఇక ఈ చిత్ర సక్సెస్ మీట్లో భాగంగా యశ్ మాట్లాడుతూ.. షారుఖ్ సినిమా కంటే నా సినిమా బాగా ఆడాలనేది తన ఉద్దేశం కాదని.. రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నాను. మా చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ మా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నార్త్ ఇండియాలో నేనెవరో కూడా తెలీదు కానీ.. నా ఇంట్రడక్షన్ సీన్‌కు చప్పట్లు, ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశాడు యశ్.