అది గనుక ఓకే అయితే తారక్ ఫ్యాన్స్ కు పండగే..!

ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ 2020 జూలై 30 న విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో పనిచేస్తాడా.. అని తారక్ ఫ్యాన్స్ లోనే కాకుండా మిగిలిన ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో త్రివిక్రమ్, కొరటాల శివ పేర్లతో పాటు ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు కూడా వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని.. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుందని కూడా వార్తలు వచ్చాయి.

‘మంచి కథ దొరికితే మేము సిద్దమే.. తారక్ మాకు మాటిచ్చారు’.. అంటూ మైత్రి నిర్మాతలలో ఒకరైన నవీన్ ఎర్నేని ఓ సందర్భంలో తెలియజేసాడు. దీంతో స్క్రిప్ట్ పనుల్లో ప్రశాంత్ బిజీగా గడుపుతున్నాడట. ఓ పక్క ‘కె.జి.ఎఫ్’ సీక్వెల్ ను తెరకెక్కిస్తూనే.. తారక్ తో చేసే సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడని సమాచారం. ఇది ఒక ‘డ్యాన్స్ బేస్డ్’ మూవీ అని తెలుస్తుంది. తారక్ ఎలాగు డ్యాన్స్ లు ఇరక్కొట్టేస్తాడు కాబట్టి… అలాంటి స్క్రిప్ట్ అయితే బెటర్ అని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ఒకవేళ ఈ స్క్రిప్ట్ తారక్ కు నచ్చి… ఓకే అయితే ఎన్టీఆర్ అభిమానులకి పండగనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus