Yash: ‘కేజీయఫ్‌’ స్టార్‌ యశ్‌ ఎమోషనల్‌ నోట్‌.. ఏం రాశాడంటే?

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టే బ్యాట్స్‌మన్‌ మూడో మ్యాచ్‌ ఆడటానికి చాలా సమయం తీసుకుంటే ఎలా ఉంటుంది. చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా. మంచి ఫామ్‌లో ఉన్నాడు కదా.. అలా ఎలా గ్యాప్‌ తీసుకుంటాడు అని అనుకుంటారు. అలా సినిమాల్లో గ్యాప్‌ తీసుకుంటున్న నటుడు యశ్‌. ‘కేజీయఫ్‌’, ‘కేజీయఫ్‌ 2’ సినిమాలతో పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ విజయాలు అందుకున్న యశ్‌.. తర్వాతి సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. పుట్టిన రోజు నాడైనా చెబుతాడేమో అనుకుంటే మళ్లీ నిరాశే మిగిల్చాడు.

యశ్ సోషల్‌ మీడయాలో గురువారం రాత్రి ఓ పోస్ట్‌ వచ్చింది. ఆ నోటిఫికేషన్‌ చూసి అభిమానులు తెగ ఆనందపడిపోయారు. మా యశ్‌ కొత్త సినిమా గురించి చెప్పాడా? అని అనుకుంటూ ఆ నోటిఫికేషన్‌ క్లిక్‌ చేశారు. ఏదైనా సినిమా ప్రీ లుక్‌, లుక్‌ పోస్టర్‌ ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ అందులో ఓ లేఖ మాత్రం ఉంది. దీంతో అభిమానులు చాలా నిరాశపడిపోయారు. ఇదేంటి యశ్‌ ఇలా చేశాడు అనుకుంటూ నిరాశతో లేఖ చదివారు. అయితే అందులో తన మాటలు చూసి మా యశ్‌ బంగారం అంటూ మళ్లీ మురిసిపోయారు.

అందులో యశ్‌ ఏం రాశాడంటే..
టు,
నా బలమైన నా అభిమానులకు

‘‘నా మీద ఇన్నాళ్లుగా ప్రేమాభిమానులు కురిపస్తున్న అభిమాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేనెప్పుడు పుట్టిన రోజులు జరుపుకోను. అయితే కొన్నేళ్లుగా అభిమానుల మధ్యలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటోంది. మీతో గడిపిన నా పుట్టిన రోజు నా జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ప్రస్తుతం నా జీవితంలో నేను సాధించాలి అనుకుంటున్న దాని కోసం ప్రాణం పెట్టి కష్టపడుతున్నాను.

నేను జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగడానికి, బాగా కష్టపడానికి అవసమైన బలాన్ని ఇచ్చేది మీరే. నేను ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు కచ్చితంగా మీరు నా నుండి ఎదురుచూస్తున్న విషయాన్ని తప్పక చెబుతాను. దీని కోసం నాకు ఇంకాస్త సమయం కావాలి. మీరు ఆశిస్తున్నట్లుగా జనవరి 8న ఆ విషయం చెప్పలేను. ఈ పుట్టిన రోజు సందర్భంగా మీ నుండి నేను ఆశించే గిఫ్ట్‌ ఒకటే. నన్ను అర్థం చేసుకొని, కొంచెం ఓర్పుతో ఉండండి’’

‘‘ఈ పుట్టిన రోజు నాకు నేను బెంగళూరులో ఉండటం లేదు. అందుకే మిమ్మల్ని కలవలేకపోతున్నాను. మీ ప్రేమ ఆశీర్వాదాలు నాకు చాలా ముఖ్యం. మీకు మాటిస్తున్నాను.. మీ వెయిటింగ్‌కి తగ్గ సినిమాకు అందిస్తాను’’

– ప్రేమతో మీ యశ్‌

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus