ఖైదీ నంబర్ 150 ఆడియో రివ్యూ

మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 మూవీ ఈనెల 11 న విడుదల కాబోతోంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మితమయిన చిరు ప్రతిష్టాత్మకమైన మూవీ పాటలను కొత్త తరహాలో యూట్యూబ్ లో ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి నిర్మాత రామ్ చరణ్ ట్రెండ్ సృష్టించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఆ పాటలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

1. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు

“ఇది మాస్ సాంగ్ కాదు బాస్ సాంగ్” అంటూ ఖైదీ నంబర్ 150 చిత్రం తొలిగా ఈ పాటను రిలీజ్ చేశారు. దీన్నీ దేవీ శ్రీ ప్రసాద్ రాసి, కంపోజ్ చేసి, పాడడం విశేషం. ఎక్కడో విన్న అనుభూతి కలిగించినప్పటికీ మెగా అభిమానులకు బాగా నచ్చింది. మధ్యలో చిరు గొంతు కలపడం హుషారు పెంచుతుంది. డిసెంబర్ 18 విడుదలయిన ఈ పాటకు ఇప్పటికీ 9 లక్షల వ్యూస్ వచ్చాయి.

2. యు అండ్ మీ

ఆల్బమ్ లో రెండో పాట “యు అండ్ మీ” రొమాంటిక్ మెలోడీగా అభినందనలు అందుకుంది. ప్రముఖ గాయనీ గాయకులూ శ్రీయా ఘోషాల్, హరిహరన్ లు ఆలపించిన యుగళ గీతం మదిని మీటుతొంది. కోపం సైనికుడి వరుస, తాపం ప్రేమికుడి వరుస .. రెండు ఒకటైతే నువ్వేనా?.. అంటూ సరళమైన పదాలతో అందరికీ అర్ధమయ్యే సాహిత్యాన్ని శ్రీమణి సమకూర్చారు. తెరపైన చిరంజీవి, కాజల్ అగర్వాల్ ఈ పాటకు మరింత అందాన్ని అద్దుతారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

3. రత్తాలు

ఆల్బమ్ లో పక్కా మాస్ సాంగ్ “రత్తాలు”. మెగాస్టార్ ఎనర్జీని, ఫ్యాన్స్ ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని మంచి బీట్ తో దేవీ ఈ పాటను కంపోజ్ చేశారు. నాకాష్ అజీజ్, జాస్మిన్ లు జోష్ గా పాడి కిక్ ఇచ్చారు.
“మైడియర్ బాస్.. నువ్వు .. క్లాస్ ప్లస్ మాస్” .. నాకు నువ్వు..నీకు నేను అప్పజెబుదాం పాఠాలు .. అంటూ దేవీ రచయితగాను బాగా కష్టపడ్డారు.

4. సుందరి

శ్రీమణి కలం నుంచి వచ్చిన మరో పాట “సుందరి”. ఇందుకు ప్యూర్ ఫ్రెష్ ట్యూన్ ని దేవి అందించారు. జస్ ప్రీత్ చాలా నైస్ గా పాడి అందరూ హమ్ చేసుకునేలా చేశారు.

5 . నీరు నీరు

అద్బుతపాటలను రాస్తున్న రామజోగయ్య శాస్త్రి ఖైదీ నంబర్ 150 కోసం రాసిన పాట “నీరు నీరు”. భారమైన పదాలతో రైతుల కష్టాలను కళ్లకు కట్టారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ గాత్రం పాటను గుండె లోతుల్లోకి తీసుకుపోతోంది. కథానుసారం వచ్చే ఈ పాటని రాక్ స్టార్ హృద్యంగా స్వరపరచి శెభాష్ అనిపించుకున్నారు.

సినీ విజయంలో ఆడియో కీలక పాత్ర పోషిస్తుంది. పాటలు హిట్ అయితే సినిమా సగం విజయం సాధించినట్లే. ఆ విజయాన్ని దేవీ శ్రీ ప్రసాద్ చిరుకి తన మ్యూజిక్ ద్వారా ఇచ్చారు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా ఐదు ట్యూన్స్ అందరికి నచ్చుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus