ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీ, వేదికల్లో మార్పు

మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన150వ చిత్రం ‘ఖైదీ నెం150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగే వేదిక మారింది. ఈనెల 4 వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని చిత్ర నిర్మాత రామ్ చరణ్ తేజ్ కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. తాజాగా వేదిక, తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ కార్యక్రమం ఈ నెల 7 తేదీకి పోస్ట్ పోన్ చేశారు. మంగళగిరి లోని హాయ్ ల్యాండ్ లో ఈ ఫంక్షన్ నిర్వహించాలని చిత్ర బృందం డిసైడ్ అయింది. ఇందుకుగల కారణం ఇంకా తెలియరాలేదు. ఎక్కువమంది అభిమానులు వస్తే ఎటువంటి ఇబ్బందికలగకుండా ఉండాలనే వేదిక మార్చారని, వీకెండ్ అయితే అందరికీ అనువుగా ఉంటుందనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెగాస్టార్ సన్నిహితులు వెల్లడించారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు చిరు అభిమానులను ఉర్రుతలూగిస్తున్నాయి. టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ మూవీ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. తమిళ హిట్ చిత్రం కత్తి కి రీమేక్ అయిన ఖైదీ నెం150’  సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus