150 కోట్లకు చేరువలో ఖైదీ నంబర్ 150 మూవీ కలక్షన్స్
- January 24, 2017 / 06:25 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ బాక్స్ లను బద్దలు కొడుతోంది. పదేళ్ల తర్వాత చిరు హీరోగా నటించిన ఈ సినిమా కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన మెగాస్టార్ 150 వ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఆదివారానికి రెండో వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 137 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు నెలకొల్పింది. సీనియర్ హీరోల చిత్రాల హావ కొనసాగుతుండడంతో గత శుక్రవారం టాలీవుడ్ లో ఏ చిత్రం రిలీజ్ కావడానికి సాహసం చేయలేదు. దీంతో మాస్ డైరక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫిల్మ్ 12 రోజులకి ప్రపంచవ్యాప్తంగా 93 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ మూవీ ఓవర్ సీస్ లోను కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆదివారానికి విదేశాల్లో మొత్తం 2,394 ,139 డాలర్లు వసూలు చేసినట్లు అక్కడి మీడియా స్పష్టం చేసింది. మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లలో 150 కోట్ల (గ్రాస్) మార్క్ ని చేరుకొని రికార్డు సృష్టిస్తుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















