మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చేతికి రఫ్ ఆడించే తత్వం పోలేదు. ఖైదీ నంబర్ 150 మూవీతో బాక్స్ ఆఫీస్ ని బాస్ షేక్ చేయించారు. మాస్ డైరక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ అయి రికార్డులకు కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేయించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ ఫిల్మ్ విడుదలయిన అన్నీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటి రోజు “ఖైదీ” 47.45 కోట్లు కొల్లగొట్టాడు. ఫస్ట్ డే అత్యధిక కలక్షన్స్ సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో రెండో స్థానాన్ని చిరు మూవీ దక్కించుకుంది.
ఆ తర్వాత గౌతమి పుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు విడుదలయినప్పటికీ ఖైదీ కలెక్షన్లలో కుమ్ముడు ప్రదర్శించాడు. చిరంజీవి ద్విపాత్రాభినయం, కాజల్ తో కెమిస్ట్రీ, లక్ష్మీరాయ్ అందాలు, హుషారైన పాటలు, అదిరిపోయే ఫైట్స్ ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపించడానికి దోహదం చేశాయి. ఖైదీ నంబర్ 150 ఐదురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 97.36 కోట్ల గ్రాస్ వసూల్ చేసి మెగాస్టార్ సత్తాని చూపించింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వీకెండ్ కి 150 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ అని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.