చిరు వెనకడుగు వేస్తాడా??

టాలీవుడ్ అంతా మాత్రమే కాదు….యావత్ ప్రేక్షక లోకం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ఏది అని అడిగితే….ఖచ్చితంగా ఎక్కువ శాతం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా అని చెప్తారు….అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూరీ కావొస్తున్న తరుణంలో ఈ సినిమా గురించి వార్త ఒకటి టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతుంది…ఇంతకీ ఏంటి ఆ వార్త? ఏమా కధ అంటే…మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం “ఖైదీ నెంబర్ 150” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కొందరు చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ ని సంక్రాంతి సీజన్ కు కాకుండా సమ్మర్ సీజన్ కు విడుదల చేస్తే బాగుటుంది అని సూచనలు ఇస్తున్నారు.

దాని గల కారణం సైతం చెబుతూ మెగా స్టార్ చిరంజీవి గత సినిమాల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే సంక్రాంతికి విడుదలైన సినిమాలకన్నా సమ్మర్ కు విడుదలైన సినిమాలు చిరంజీవి కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారి బాగా కలిసివచ్చిన నేపధ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’ ని సమ్మర్ కు విడుదల చేస్తే బాగుటుంది కదా అని తెలుస్తుంది…దీనికి తోడు బాలయ్య 100వ చిత్రం సైతం సంక్రాంతి బరిలో ఉండడం, అంతేకాకుండా బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ గతంలో చాల సార్లు కలిసి వచ్చిన నేపధ్యంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో అనవసరపు పోటీ ఎందుకు అని కొందరు సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని చరణ్ కు సూచనలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ చరన్ తిరస్కరిస్తూ సంక్రాంతి బరిలో నాన్న దిగుతున్నాడు అని అంటున్నాడు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus