Khushi: 20 ఏళ్ల క్రితం పాయింట్‌ని పట్టుకుని ఇప్పుడు మళ్లీ ‘ఖుషి’ తీస్తున్నారా?

  • April 26, 2023 / 08:07 PM IST

20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఖుషి’ సినిమా ఇటీవల రీ రిలీజ్‌ అయ్యి కూడా అదిరిపోయే వసూళ్లు సంపాదించుకుంది. అలాంటి అదే పేరు, కాన్సెప్ట్‌తో మరో సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఇంకా అదిరిపోతుంది కదా. ఇప్పుడు అదే జరుగుతోంది అని అంటున్నారు. అచ్చంగా అదే కథ కాకపోయినా.. ఇంచుమించు అదే కాన్సెప్ట్‌లో ఓ సినిమా సిద్ధమవుతోంది. అదే శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’. అవును విజయ్‌ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా పాయింట్‌ పాత ‘ఖుషి’నే పోలి ఉంటుందని సమాచారం.

మూడు డిజాస్టర్ల తర్వాత ముగ్గురు ప్రధాన పాత్రధారులు కలసి రూపొందిస్తున్న సినిమా ‘ఖుషి’. ‘టక్‌ జగదీష్‌’ తర్వాత శివ నిర్వాణ… ‘లైగర్‌’ తర్వాత విజయ్‌ దేవరకొండ.. ‘శాకుంతలం’ తర్వాత సమంత కలసి ‘ఖుషి’ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా… సామ్‌ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. త్వరలో షూటింగ్‌ ప్రారంభించి క్విక్‌గా పూర్తి చేస్తారని టాక్‌. ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త వైరల్‌ అవుతోంది. అదే సినిమా కాన్సెప్ట్‌.

పాత ‘ఖుషి’ (Khushi) తరహలోనే ఈ సినిమాలోనూ ఈగో అనేది ప్రధానాంశంగా ఉంటుంది అని అంటున్నారు. ఎంతగానో ప్రేమించుకున్న హీరోహీరోయిన్లు ఈగో వల్ల దూరమవ్వడం.. ఆ తర్వాత పరిస్థితులను శివ నిర్వాణ స్టైల్‌లో చూపిస్తారు అని అంటున్నారు. ఇప్పటివరకు శివ నిర్వాణ చేసిన సినిమాలు డిఫరెంట్‌ లుక్‌లో ఉంటాయి. ప్రేమలో విషాద కోణం బాగా చూపిస్తారని ఆయనకు పేరు. మరి ఈ సినిమాలో ఏం చూపించారు అనేది చూడాలి.

అన్నట్లు ఈ సినిమాను సెప్టెంబరు 1న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే సమంత ‘సిటాడెల్‌’ పనుల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయలేకపోతోంది అని టాక్‌. త్వరలో డేట్స్‌ ఇచ్చి సినిమా పూర్తి చేస్తే.. అనుకున్న సమయానికి సినిమా వచ్చే అవకాశం ఉంది. లేదంటే మళ్లీ వాయిదాల పర్వం కొనసాగుతుంది అని చెప్పొచ్చు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus