ఇప్పుడు ప్రేమించే టైమ్ లేదు, సినిమాలే ముఖ్యం

“భరత్ అనే నేను”లో వసుమతిగా చాలా సాఫ్ట్ గా కనిపించి కనువిందు చేసిన కైరా అద్వానీ క్యూట్ అమ్మాయి అనే ఇమేజ్ ను సొంతం చేసుకొంది. అయితే.. చూడ్డానికి క్యూట్ గా ఉన్నా అమ్మడు బాలీవుడ్ లో చేసిన సినిమాలు అమ్మడికి హాట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అమ్మడు బాలీవుడ్ లో నటించిన “మెకానిక్” సినిమా చూస్తే అమ్మడి అందాల ఆరబోతకు ఎవరైనా దాసోహమనాల్సిందే. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొంటూ ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం “అర్జున్ రెడ్డి”కి రీమేక్ గా బాలీవుడ్ లో రూపొందిన “కబీర్ సింగ్” ప్రమోషన్ లో బిజీగా ఉంది కైరా అద్వాని. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫస్ట్ లవ్ గురించి తెలిపింది. తాను 10వ తరగతిలోనే ప్రేమలో పడ్డానంది. తన మొదటి ప్రేమ విషయాలను కైరా వెళ్లడించి హాట్ టాపిక్ అయ్యింది. నేను 10వ తరగతిలో ఉన్న సమయంలో ఒక అబ్బాయిని ప్రేమించాను. అతడిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కాని ఇంట్లో అమ్మ చదువుపై దృష్టి పెట్టమంటూ మందలించింది. ఈ వయసులో ప్రేమ ఏంటీ అంటూ అమ్మ కోప్పడటంతో నేను అతడితో బ్రేకప్ అయ్యాను. ఇప్పుడు ప్రేమించేందుకు సమయం లేదంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus