నటిగా ఎక్కువకాలం కొనసాగాలనుంటే ఏమి చేయాలో చెప్పిన కైరా!

సినిమా పరిశ్రమలో ఛాన్స్ అందుకోవాలంటే అదృష్టం ఉండాలి. వచ్చిన అవకాశాన్ని కష్టపడి సద్వినియోగం చేసుకోగలగాలి. లేకుంటే పోటీ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. అయితే చిత్రపరిశ్రమలో ఎక్కువకాలం కొనసాగాలంటే మంచి చిట్కా చెప్పింది బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ. క్రికెటర్ ధోనీ బయోపిక్ మూవీ ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఈమె..  భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే తెలుగువారి మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను, రామ్ చరణ్ తేజ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న కలంక్ చిత్రంలోనూ అవకాశం పట్టేసింది.

అలాగే లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంటోంది. తనలాగే పరిశ్రమలో మీరూ బిజీగా ఉండాలంటే చాలా సింపుల్ అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. రీసెంట్ గా ముంబై మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “మీరు నిజంగా ప్రతిభావంతులయితే.. దానిని అందరి ముందు ప్రదర్శించండి. తప్పకుండా మీ ట్యాలెంట్ ని వారు గుర్తిస్తారు. ఆటోమేటిక్ గా ఇండస్ట్రీ లో ఎక్కువకాలం కొనసాగుతారు” అని వెల్లడించింది. కొంతమంది కొత్త నటీనటులు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, మేల్ డామినేషన్ వంటి అంశాలపై మాట్లాడి వార్తల్లో నిలిస్తుంటే.. కైరా మాత్రం పాజిటివ్ గా మాట్లాడి అందరితో మంచిపిల్లగా పేరు తెచ్చుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus