టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న హీరోయిన్లలో కియారా అద్వానీ (Kiara Advani) ఒకరు. ఈ ఏడాది గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాతో కియారా అద్వానీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయమని అభిమానులు ఫీలవుతున్నారు. నేను ఎంత త్వరగా బరువు పెరగగలనో అంతే త్వరగా బరువు తగ్గగలనని ఆమె చెప్పుకొచ్చారు. నాకు బరువు పెరగడం తగ్గడం సులువు అని డ్యాన్స్, స్విమ్ నాకు చాలా ఇష్టమని కియారా అద్వానీ పేర్కొన్నారు.
స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఈ రెండూ చేసేదాన్నని ఆమె వెల్లడించారు. నచ్చిన ఆహారాన్ని ఎక్కువగా తినడం, ఉపవాసాలు చేయడం అస్సలు పాటించనని కియారా అద్వానీ పేర్కొన్నారు. ఈ రెండు పనులు తాను అస్సలు చేయనని మసాలా ఎక్కువగా ఉండని ఇంటి భోజనం తినడానికి మాత్రం ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు. తాను సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత డ్యాన్స్, స్విమ్మింగ్ ను దినచర్యలో భాగంగా ప్లాన్ చేసుకుని చేస్తున్నానని కియారా అద్వానీ అన్నారు.
జిమ్, డ్యాన్స్ స్విమ్మింగ్ ఫిట్ నెస్ లో భాగమేనని ఆమె తెలిపారు. జిమ్, డ్యాన్స్, స్విమ్మింగ్ ఇవన్నీ ఫిట్ నెస్ లో భాగమేనని కియారా అద్వానీ పేర్కొన్నారు. కియారా అద్వానీ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కియారా అద్వానీ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కియారా అద్వానీకి కెరీర్ పరంగా తిరుగులేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కియారా అద్వానీ గేమ్ ఛేంజర్ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో క్లారిటీ రానుంది.