Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్ ఛేంజర్’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?
- October 29, 2026 / 02:00 PM ISTByFilmy Focus Desk
‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి ప్రస్తావిస్తే.. ఇద్దరు వ్యక్తులు పూర్తిగా కామ్ అయిపోతారు. ఒకరు నిర్మాత దిల్ రాజు. రెండోది రామ్‌చరణ్ ఫ్యాన్. ఎందుకంటే ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఇబ్బంది కాబట్టి. అయితే, ఈ సినిమా కథా రచయిత కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమా గురించి ఇటీవల మాట్లాడారు. ఆయన మాటలు ఇప్పుడు ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్లో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే సినిమా అలా అవ్వడానికి ఆయనో కారణం చెప్పారు.
Karthik Subbaraj
‘మహాన్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు శంకర్‌కు ‘గేమ్ ఛేంజర్’ కథ ఇచ్చానని, పనుల ఒత్తిడి వల్ల ఆ తర్వాత ఆ కథ మీద పూర్తిగా వర్క్ చేయలేదని చెప్పారు కార్తిక్ సుబ్బరాజు. ఆయన అక్కడితో ఆగితే బాగుండేది. రామ్ చరణ్ ఇమేజ్, బడ్జెట్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు వాళ్ళే చేసుకున్నారని చెప్పారు. అక్కడితో ఆగారా అంటే కథలో కొన్ని మార్పులు చేసేశారని అసలు విషయం చెప్పి తేనె తుట్టె కదిపారు.

కార్తిక్ సుబ్బరాజ్ రాసుకున్న కథ ప్రకారం హీరో ద్విపాత్రాభినయం చేయాలి. అయితే అందులో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్, రెండోది గ్యాంగ్‌స్టర్. ఆ పాత్ర కథలో స్నేహితుల వెన్నుపోటు, రాజకీయాలు ఉంటాయి. అయితే శంకర్ ఆ కథను తీసుకున్నాక ఐఏఎస్‌ను ఎన్నికల అధికారిగా మార్చారు. గ్యాంగ్ స్టర్ పాత్రను అప్పన్న పాత్రగా మార్చారు. దీంతో ఆ సినిమా ఇలా అవ్వడంలో అన్ని వేళ్లూ శంకర్ వైపే చూపిస్తున్నాయి.
అయితే, తాను అనుకున్నట్లుగా సినిమా చేయాలేకపోయానని, అందుకే కొన్ని ట్రాక్‌లు మధ్యలోనే వదిలేశానని చెప్పారు. దానికో ఉదాహరణ ఐఏఎస్ చరణ్ కుటుంబం. తొలుత కనిపించి, ఆ తర్వాత వారు ఎక్కడా కనిపించరు. దీంతో సినిమా ఫలితం విషయంలో శంకర్ మాత్రమే కాకుండా, ఇంకొందరు ఉన్నారు అనే విమర్శలూ ఉన్నాయి. మరి అవి ఎప్పుడు బయటపడతాయో చూడాలి.















