ఫ్యాషన్ వరల్డ్’ ని దుమ్ము దులుపుతున్న కైరా అద్వానీ..!

మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ పరిచయమయ్యి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కైరా అద్వానీ. ఆ వెంటనే రాంచరణ్ ‘వినయ విధేయ రామా’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్ర ఫలితం ఎలా ఉన్నప్పటికీ కైరా అద్వానీ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు కైరా స్టార్ హీరోయిన్ అని చెప్పడంలో సందేహం లేదు. ఓ పక్క సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే స్టైల్ ఐకన్ గా ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తుంది. ర్యాంప్ వాక్ లతో సైతం కుర్ర కారుకి హీటెక్కిస్తోంది.

తాజాగా పర్యవసానంగా ప్రఖ్యాత ‘ఏసియా విజన్స్’ కైరాని 2018 ‘ఎమర్జింగ్ స్టార్’ గా ఎంపికచేసింది. ‘ఐ క్యాచింగ్ గాళ్’ గా కైరా సాధించిన ఈ సాధించిన ఘనతకి కైరా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ‘ఎం.ఎస్.ధోని’ చిత్రంతో బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన కైరా… ప్రస్తుతం ‘కబీర్ సింగ్’ (అర్జున్ రెడ్డి రీమేక్) లో నటిస్తుంది. బాలీవుడ్ తో పాటు.. సౌత్ ఇండస్ట్రీస్ క్రేజీ హీరోయిన్ గా రాణిస్తుంది. ప్రస్తుతం కైరా అంద చందాల గురించి.. ఫ్యాషన్ ఎలివేషన్ గురించి కుర్రకారు పదే పదే చర్చించుకుంటున్నారు. తాజాగా ‘ఎమర్జింగ్ స్టార్’ అన్న కీర్తిని దక్కించుకుంది కాబట్టి .. కైరా మరింతగా దూసుకుపోతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇదిలా ఉంటే… ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’, ‘మహేష్ 26’ లో కూడా కైరా అద్వానీ హీరోయిన్ గా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus