మరీ ఇంత అందంగా ఉంటే కుర్రాళ్ళ మనసులు ఏమైపోవాలి

  • May 3, 2019 / 07:53 PM IST

“భరత్ అనే నేను”లో వసుమతిగా చాలా సాఫ్ట్ గా కనిపించి కనువిందు చేసిన కైరా అద్వానీ క్యూట్ అమ్మాయి అనే ఇమేజ్ ను సొంతం చేసుకొంది. అయితే.. చూడ్డానికి క్యూట్ గా ఉన్నా అమ్మడు బాలీవుడ్ లో చేసిన సినిమాలు అమ్మడికి హాట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అమ్మడు బాలీవుడ్ లో నటించిన “మెకానిక్” సినిమా చూస్తే అమ్మడి అందాల ఆరబోతకు ఎవరైనా దాసోహమనాల్సిందే. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొంటూ ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం “అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ లో నటిస్తున్న కియారా నిన్న ప్యారాషూట్ కోకోనట్ ఆయిల్ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఒక ఈవెంట్ లో పాల్గొంది.

ఆ ఈవెంట్ కి కియారా హాజరైన ఫోటోలు యువత మతులు పోగొడుతున్నాయి. అందాలు ఆరబోయకుండానే బాడీ కర్వ్స్ లో కైపెక్కిస్తోంది కియారా. ప్రస్తుతం ఆ ఈవెంట్ ఫోటోస్ అన్నీ వైరల్ అయ్యాయి. మళ్ళీ కైరాను తెలుగు తెరపై ఎప్పుడు చూస్తామా అని తెలుగు ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus