బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌పై (Ajaz Khan) తాజాగా తీవ్ర ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముంబైలోని చార్‌కోప్ పోలీస్ స్టేషన్‌లో 30 ఏళ్ల యువతి ఫిర్యాదు చేయడంతో అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. సినిమా రంగంలో అవకాశాలు ఇస్తానని నమ్మించి అజాజ్ ఖాన్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అజాజ్ ఖాన్‌ను త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.
అజాజ్ ఖాన్ ఇటీవల ‘హౌజ్ అరెస్ట్’ అనే వెబ్ షో హోస్ట్‌గా వివాదంలో చిక్కుకున్నాడు. ఉల్లు యాప్‌లో స్ట్రీమ్ అయిన ఈ షోలో అసభ్య కంటెంట్ ఉందని, మహిళా కంటెస్టెంట్లను అసభ్యకరమైన చర్యలకు ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై బజరంగ్ దళ్ యాక్టివిస్ట్ గౌతమ్ రవ్రియా ఫిర్యాదు చేయడంతో అజాజ్ ఖాన్, షో నిర్మాత రాజ్‌కుమార్ పాండే, ఉల్లు యాప్ సీఈఓ విభు అగర్వాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన షో క్లిప్స్‌లో అజాజ్ ఖాన్ (Ajaz Khan) కంటెస్టెంట్లను అసభ్య చర్యలకు ఒత్తిడి చేస్తున్నట్లు కనిపించడంతో ఈ షోను ఉల్లు యాప్ నుంచి తొలగించారు. ఈ వివాదంపై నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ (NCW) సీరియస్‌గా స్పందించి, అజాజ్ ఖాన్, విభు అగర్వాల్‌లను మే 9న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అజాజ్ ఖాన్ ఇదివరకే పలు వివాదాల్లో చిక్కుకున్నారు.
2018లో నవీ ముంబై యాంటీ నార్కోటిక్స్ సెల్ అతడిని ఎక్స్‌టసీ డ్రగ్స్ కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అరెస్ట్ చేసింది. 2019లో టిక్‌టాక్‌లో వివాదాస్పద వీడియోలు పోస్ట్ చేసినందుకు ముంబై సైబర్ సెల్ అతడిని అరెస్ట్ చేసి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇప్పుడు అత్యాచారం కేసు, ‘హౌజ్ అరెస్ట్’ వివాదంతో అజాజ్ ఖాన్ (Ajaz Khan) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఆరోపణలపై అతడు ఇంకా అధికారికంగా స్పందించలేదు.