Kiccha Sudeep: తన జీవితంలో కీలక వ్యక్తి గురించి చెప్పిన సుదీప్‌.. ఎవరంటే?

ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అంటారు. ఇది ప్రతి ఒక్క మగాడి జీవితంలో కచ్చితంగా జరుగుతుంది. ఈ మాటను సినిమా తారలకు అన్వయిస్తే.. ప్రతి హీరో విజయం వెనుక ఆయన సతీమణి త్యాగాలు ఉంటాయి అని చెప్పాలి. కుటుంబం కోల్పోయిన మధుర క్షణాలు ఉంటాయి అని కూడా చెప్పాలి. చాలామంది హీరోలు ఈ విషయాలను గతంలో మాట్లాడారు. ఇప్పుడు ప్రముఖ కన్నడ స్టార్‌ సుదీప్‌ కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మాటలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే?

నా సతీమణి ప్రియ త్యాగాల వల్లే నేను నటుడిగా ఇంత దూరం ప్రయాణించగలిగాను అంటూ కిచ్చా సుదీప్‌ ఆమె గురించి చెప్పుకొచ్చారు. దాంతోపాటు తన జీవితం ఇలా ఉండటానికి కారణమైన ఆమెకు ధన్యవాదాలు కూడా చెప్పారు. ఇప్పుడెందుకు చెప్పారు అనేగా మీ డౌట్‌.. ఏం లేదండీ.. సుదీప్‌ నటుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి బుధవారంతో 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సుదీప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది ట్విటర్‌గా మారిపోయాయి.

‘‘28 ఏళ్ల నా సినీ ప్రయాణానికి తొలి అడుగు పడింది ఈ రోజునే. నా భార్య ప్రియా సుదీప్‌ చేసిన త్యాగాల వల్లే నా జీవితం సాధ్యమైంది. ఆమె సపోర్ట్ లేకపోతే నేను ఈ ప్రయాణం చేసేవాడిని కాదేమో. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. నన్ను నాలా ఉంచి, నా ప్రయాణాన్ని గౌరవించినందుకు… ప్రియా నీకు ఎన్నో సందర్భాల్లో కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. కానీ ప్రతిసారి ఫెయిల్‌ అయ్యాను. ఇప్పుడు చెబుతున్నాను.. నా విషయంలో నువ్వు చేసిన ప్రతి పనికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్స్‌లో పేర్కొన్నారు సుదీప్‌.

దాంతోపాటు కుమార్తె శాన్వీ గురించి కూడా చెప్పాడు సుధీప్‌. ‘‘ఏ విషయమైనా సరే తన అభిప్రాయాన్ని ఎంతో చక్కగా చెప్పే నా కుమార్తె శాన్వీకి కూడా థ్యాంక్స్‌. ఇక నాకు ఈ జీవితాన్ని అందించిన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు’’ అని సుదీప్‌ ట్వీటారు. సీరియల్‌ నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన సుదీప్‌ ‘తాయవ్వ’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సహాయ నటుడిగా అలా మొదలు పెట్టి… ‘స్పర్శ’ సినిమతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, హిందీలోనూ నటించిన విషయం తెలిసిందే.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus