Sudeep: పది కోట్ల రూపాయల పరువు నష్ట దావా వేసిన హీరో సుదీప్!

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈయన పలు సినిమాల ద్వారా తెలుగులో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కొద్ది రోజులుగా సుదీప్ గురించి కొందరు నిర్మాతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈయన సినిమాకు కమిట్ అయ్యి నిర్మాత నుంచి రెమ్యూనరేషన్ తీసుకొని అనంతరం సినిమా డేట్స్ ఇవ్వలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు.ఈ విధంగా నిర్మాతలు ఎం ఎన్ కుమార్, ఎం ఎన్ సతీష్ సుదీప్ పట్ల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో ఇది కాస్త శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో చర్చలకు కారణమయ్యాయి.

అయితే ఈ ఆరోపణలపై స్పందించినటువంటి (Sudeep) సుదీప్ ఏకంగా పరువు నష్ట ధావా వేశారు. నిర్మాతలు తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో ఈయన కోర్టును ఆశ్రయించి ఏకంగా 10 కోట్ల రూపాయల పరువు నష్ట ధావా వేశారు. సుదీప్ ఎనిమిది సంవత్సరాల క్రితం తనతో ఒక సినిమాకు కమిట్ అయ్యారని కానీ తనకు డేట్స్ ఇవ్వకుండా తనని మోసం చేశారు అంటూ ఆరోపణలు చేశారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాలని తెలిపారు.

అంతేకాకుండా తన కిచెన్ రేనోవేషన్ కోసం అదనంగా మరో పది లక్షల రూపాయలు కూడా తీసుకున్నారనీ నిర్మాత ఎంఎన్ కుమార్ ఆరోపణలు చేశారు. ఈ విధంగా నిర్మాత చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని ఆయన తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాడంటూ కోట్లు ఆశ్రయించిన పది కోట్ల రూపాయల పరువు నష్ట దావా వేయడమే కాకుండా తనకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.అదేవిధంగా ఈ విషయాన్ని తాను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలిపారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus