అక్కినేని నాగార్జున హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కింగ్'(King).2008 డిసెంబర్ 25న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘కామాక్షి మూవీస్’ బ్యానర్ పై డి.శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ మమతా మోహన్ దాస్ అత్యంత కీలక పాత్ర పోషించారు. బ్రహ్మానందం, శ్రీహరి, వేణు మాధవ్, మాస్టర్ భరత్,శ్రీనివాస్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. కామెడీ వర్కౌట్ కావడంతో తర్వాత బాక్సాఫీస్ వద్ద బాగానే గట్టెక్కేసింది ‘కింగ్’.
చాలా మందికి ఈ సినిమా హిట్టా? కాదా అనే డౌట్ ఉంది. ఈ డిసెంబర్ 25 కి ‘కింగ్’ రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 8.6 cr |
| సీడెడ్ | 4.3 cr |
| ఆంధ్ర(టోటల్) | 9.62 cr |
| ఏపీ+తెలంగాణ (టోటల్) | 22.52 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.49 cr |
| ఓవర్సీస్ | 2 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 27.01 కోట్లు(షేర్) |
‘కింగ్’ సినిమా రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.27.01 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.9.01 కోట్ల లాభాలతో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ టైంకి నాగార్జున కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ ‘కింగ్’ కావడం విశేషం. అంతకు ముందు సంవత్సరం వచ్చిన ‘డాన్’ సినిమా నాగార్జున కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది. వాటిని ‘కింగ్’ బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.