Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

ఆ రోజు ‘దండోరా’ సినిమా ప్రెస్‌మీట్‌లో హీరోయిన్లు వేసుకునే దుస్తుల గురించి శివాజీ మాట్లాడుతూ వాడిన పదాలు చాలా తప్పు. ఎవరూ, ఎప్పుడూ, ఎక్కడా అనకూడదని మాటలవి. ఆ మాటల్ని ఎవరూ సమర్థించకూడదు కూడా. ఆయన కూడా ఆ రెండు అన్‌పార్లమెంటరీ వర్డ్స్‌ని సపోర్టు చేసుకోలేదు. అయితే ఈ విషయం ఎప్పటికి సమసిపోతుంది. అసలెందుకు ఇంకా ఈ విషయాన్ని డ్రాగ్‌ చేస్తున్నారు. నెక్స్ట్‌ ఏం జరగబోతోంది. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది టాలీవుడ్‌లో.

Sivaji

సినిమాల ఈవెంట్లు, ప్రైవేటు ఫంక్షన్లకు వస్తున్న హీరోయిన్లు డ్రెస్సింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండండి.. కొన్ని రకాల డ్రెస్సుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే బయటకు వచ్చేటప్పుడు ఫలానా డ్రెస్సింగ్‌లో రండి అని శివాజీ ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే ఏమైందో ఏమో ఆయన తన ‘బిగ్‌బాస్‌’ రోజుల్ని గుర్తు చేసుకున్నట్లుగా ఓ రెండు తప్పుడు పదాలు వాడేశాడు. బిగ్‌బాస్‌లో కూడా ఇలానే ఓ మాట అనేసి ఆ తర్వాత సారీలు కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు పదాలు ఆయనను వెంటాడుతున్నాయి.

శివాజీ చెప్పిన మాటలు నచ్చని నాన్‌ హీరోయిన్స్‌, గతంలో హీరోయిన్‌గా ఒకట్రెండు సినిమాలు చేసిన ఇండస్ట్రీకి చెందిన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆగ్రహం చాలా కరెక్ట్‌. తామెలా ఉండాలి, ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి అనేది ఎవరూ చెప్పక్కర్లేదు అని ప్రశ్నించారు. దీనికి శివాజీ రియాక్ట్‌ అవుతూ ‘నేను హీరోయిన్లను అన్నాను.. వాళ్లెందుకు మధ్యలోకి వచ్చారు’ అనేలా మాట్లాడారు. దానికి అవతలివైపు నుంచి నేను హీరోయిన్‌గా నటించాను అని కౌంటర్‌ వచ్చింది.

చూస్తుంటే ఇదంతా ఇక్కడితో ఆగేలా లేదు. రెండువైపులా గట్టిగా వాయిస్‌ వినిపించేవారే ఉన్నారు. కాబట్టి ఇది మాటల ఎక్స్‌ఛేంజ్‌తో తేలే విషయం కాదు. ఎవరో ఒకరు కామ్‌ అవ్వాలి. లేదంటే రెండు వర్గాలూ మాట్లాడుకోవాలి. అయితే మహిళా కమిషన్‌, టాలీవుడ్‌ పెద్దలకు ఈ విషయంలో ఫిర్యాదులు వెళ్లాయి. కాబట్టి అక్కడైనా ఈ విషయం తేలుతుంది. లేకుంటే పరిశ్రమలోని ఆరని మంటల్లో ఇదొకటి అయిపోతుంది.

సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus