ఆరు పదుల వయస్సులో కూడా యంగ్ గా కనిపిస్తూ ఒకవైపు సినిమాలతో మరోవైపు రియాలిటీ షోలతో నాగార్జున బిజీగా గడుపుతున్నారు. నాగార్జున స్టార్ హీరో కావడంతో పాటు తెలివైన బిజినెస్ మేన్ కూడా కావడం గమనార్హం. ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికంగా తీసుకునే నాగార్జున త్వరలో స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 5కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకునే నాగార్జున టాలీవుడ్ లో ఎక్కువ సంపాదన కలిగిన హీరోలలో ఒకరు కావడం గమనార్హం. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వేర్వేరు రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన నాగార్జున భారీగా లాభాలను సొంతం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాలు, సీరియల్స్ ను నిర్మిస్తూ నిర్మాణం ద్వారా కూడా నాగార్జున కళ్లు చెదిరే లాభాలను పొందుతున్నారని సమాచారం. నాగార్జున ఆస్తి వందల కోట్లు ఉంటుందని రియల్ ఎస్టేట్ లో, స్టాక్ మార్కెట్ లో కూడా నాగార్జున పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది.
నాగార్జునకు సొంతంగా ఛార్టెడ్ ఫ్లైట్ కూడా ఉందని సమాచారం. వేర్వేరు మార్గాల ద్వారా నాగార్జున శ్రమ, తెలివితో దూసుకుపోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గత కొన్నేళ్లలో నాగార్జున ఆదాయం భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాలో, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమాలో, బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!