విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ సినిమా ఈరోజు అనగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ బాగుందంటున్నారు. సెకండాఫ్ లో కొంత పార్ట్ స్లోగా ఉన్నప్పటికీ.. క్లైమాక్స్ బాగా పికప్ అయ్యిందని, విజయ్ దేవరకొండ, సత్య దేవ్ నటన, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి సినిమాకు హైలెట్ గా నిలిచాయని, టెక్నికల్ అంశాలు, నిర్మాణ విలువలు కూడా సినిమాకు హైలెట్ పాయింట్స్ అని అంటున్నారు.
మీడియాలో కూడా చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు అందరి దృష్టి కలెక్షన్స్ పై పడింది. ముఖ్యంగా పాజిటివ్ టాక్ వల్ల ఓపెనింగ్స్ ఏ రేంజ్లో వస్తాయి అనే ఆసక్తి కూడా సర్వత్రా నెలకొంది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో నిర్మాత నాగవంశీ మొదటి రోజు ఈ సినిమా రూ.40 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలిపాడు.
మరోపక్క ‘కింగ్డమ్’ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఈవెనింగ్ అండ్ నైట్ షోలకు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ వంటివి ఇంకా యాడ్ అయితే నాగవంశీ చెప్పిన నెంబర్ రిజిస్టర్ అయ్యే అవకాశం లేదు. లేదు అంటే రూ.35 కోట్ల వరకు గ్రాస్ అలాగే షేర్ పరంగా రూ.19 కోట్ల వరకు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నంబర్స్ ను ‘కింగ్డమ్’ తొలి రోజు కలెక్షన్స్ మ్యాచ్ చేస్తాయో లేదో చూడాలి.