Kiraak RP: నా దృష్టిలో కట్నం అడిగేవాడు పెద్ద వెదవ : కిరాక్ ఆర్పీ

Advertisement

ఈటీవీలో 9 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న షోలలో ‘జబర్దస్త్’ ప్రథమ స్థానంలో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేసింది. కొంతమంది హీరోలుగా కూడా సినిమాలు చేస్తున్నారు అంటే అది ‘జబర్దస్త్’ పుణ్యమే అని చెప్పాలి. అంత ఘనత సంపాదించుకున్న ‘జబర్దస్త్’ నుండి కొంతమంది తప్పుకోవడం వేరే షోలకు జంప్ అవ్వడం వంటివి మనం చూస్తూనే వస్తున్నాం. సరే ఈ విషయాలను పక్కన పెడితే జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళలో కిరాక్ ఆర్పీ ఒకడు.

అతను నాగబాబు పేరును గుండెపైన పచ్చబొట్టు వేయించుకోవడం ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.ఈ మధ్యనే ఇతను లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ దంపతులు పాల్గొన్న ఇంటర్వ్యూల్లో చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు. కిరాక్ ఆర్పీ భార్య లక్ష్మీ ప్రసన్న వారి ప్రేమ, పెళ్లి విషయాల గురించి తెలిపి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే తన భార్య కుటుంబం నుంచి అతను కట్నం కూడా ఆశించలేదు అని చెప్పుకొచ్చాడు కిరాక్ ఆర్పీ.

‘మా ఎంగేజ్మెంట్ అంత ఘనంగా జరిపించానంటే అది నాకు కాబోయే భార్య ఫ్యామిలీ కోసమే. చాలా డబ్బు ఖర్చుపెట్టి ఆ వేడుక జరిపించాం. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఫ్యామిలీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పేరు కోసం కాదు కానీ.. పెయిర్ కోసం అంత ఘనంగా చేశాను. అమ్మాయి వాళ్ళు సగం డబ్బులు పెట్టుకుంటానన్నా నేను ఒప్పుకోలేదు.నాకు కట్నంగా ఓ ఫ్లాట్ తీసుకుంటానని వాళ్ళు అన్నారు.

కానీ నాకు ఫ్లాట్ వద్దు ఏమి వద్దు అన్నాను. నా దృష్టిలో పెళ్లి చేసుకునే అమ్మాయి కోసం కట్నం తీసుకునే వాడంత వెధవ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అమ్మాయి డబ్బులు తీసుకుని వస్తే ఆ డబ్బుతో బతికేవాడు నాకు ఇష్టం ఉండదు. నాకు కట్నం అన్నా.. కానుకలు అన్నా ఇష్టం ఉండదు’ అంటూ కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus