Kiraak RP: ఆర్పీ చేపల పులుసు రెండో బ్రాంచ్ ప్రారంభం సందడి హాజరైన జబర్దస్త్ కమెడియన్స్!

జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్పీ కొన్ని రోజులపాటు స్టార్ మా కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో ఈయన ఎలాంటి బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొనకుండా ఏకంగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.ఇలా హైదరాబాదులో ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. అయితే ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. ఇలా ఈయన రెస్టారెంట్ ముందు కస్టమర్లు బారులు తీరడంతో బిజినెస్ లో మంచి లాభాలను అందుకున్నారు.

ఇలా తన రెస్టారెంట్ బిజినెస్ ఎంతో సక్సెస్ ఫుల్ కావడంతో ఈయన హైదరాబాద్లో మణికొండ ప్రాంతంలో మరొక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేశారు.ఈ క్రమంలోనే రెండో బ్రాంచ్ కు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొనడం విశేషం. ఆర్పీ తన సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయగా ఈ కార్యక్రమానికి హైపర్ ఆది, హేమ, ఆర్పీ పట్నాయక్, శాంతి స్వరూప్ చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను,వంటి తదితరులు హాజరై సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఆర్పీ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వచ్చిన తర్వాత ఈయన జబర్దస్త్ కార్యక్రమం పై అలాగే మల్లెమాల వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్పీవ్యాఖ్యలు పూర్తిగా తప్పు అంటూ హైపర్ ఆది తనకు కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని అందరూ భావించారు. కానీ ఇవన్నీ వీళ్లు మరిచిపోయి ఆర్పీ రెస్టారెంట్ కార్యక్రమంలో హైపర్ ఆది సందడి చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడటంతో ఇద్దరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus