Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

యువ హీరో కిరణ్ అబ్బావరం (Kiran Abbavaram) జీవితంలో మరో గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నాడు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అతని ఇంట్లోకి తొలి బిడ్డ అడుగు పెట్టినట్లు ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు. ఈ హ్యాపీ న్యూస్‌ను కిరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, బాబుని పాదాలకు ముద్దిచ్చే ఫోటోను పోస్ట్ చేశారు. “Blessed with a Baby Boy” అంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెబుతూ అభిమానులతో ఈ సంతోషాన్ని పంచుకున్నారు.

Kiran Abbavaram

కిరణ్, రహస్యా ప్రేమ కథ 2019లో వచ్చిన తొలి సినిమా ‘రాజా వారు రాణి గారు’ సెట్స్‌లో మొదలైంది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా వీరిద్దరిని కొత్త జంటగా గుర్తించించింది. ఆ అనుబంధం ఐదేళ్ల ప్రేమగా మారి, 2024 ఆగస్టులో వివాహ బంధంతో మరింత దగ్గరైంది. ఇప్పుడు వారి జీవితం మరో మెరుగైన దశలోకి అడుగుపెట్టింది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం.

ఈ మధురమైన సంతోషానికి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా కిరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కిరణ్ ప్రస్తుతం మాస్ ఎంటర్టైనర్ ‘K రాంప్’ సినిమాతో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన ‘దిల్‌రుబా’ తర్వాత ఆయన ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ఇక రహస్యా కూడా తన భవిష్యత్ సినిమాలకు విరామం తీసుకుని ఈ కొత్త దశను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట జీవితం పూర్తిగా చిన్నారి చుట్టూనే తిరుగుతోంది. హనుమాన్ జయంతి రోజున పుట్టిన పాపాయికి మంచి పేరు పెట్టండి అంటూ సలహాలు ఇస్తున్నారు.

 

 ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus