Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ఆ కామెంట్స్ ని ఇంకా మర్చిపోలేదా?

మొన్నామధ్య జరిగిన ‘క’ (KA)  టీజర్ లాంచ్ వేడుకలో.. ఓ రిపోర్టర్ ‘పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లాంటి హీరోలే పాన్ ఇండియా సినిమాలు చెయ్యట్లేదు. మీ స్థాయి హీరోలు, మీరు పాన్ ఇండియా సినిమా చేయడం ఎంత కరెక్ట్’ అంటూ హీరో కిరణ్ అబ్బవరంని (Kiran Abbavaram)  ప్రశ్నించాడు. అందుకు కిరణ్ అబ్బవరం.. ‘ఇక్కడ స్థాయి అంటే కంటెంట్, ‘కాంతార’ హీరో మనకి తెలీదు. అయినా మన ప్రేక్షకులు ఎగబడి చూశారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) లో తెలిసిన వాళ్ళు లేరు.

Kiran Abbavaram

అయినా ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరించారు’ అంటూ సెన్సిబుల్ ఆన్సర్ ఇచ్చాడు. ఆ టైంలో కిరణ్ అబ్బవరం పై ప్రశంసలు కురిశాయి. ఇక దీపావళి కానుకగా విడుదలైన ‘క’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటుంది యూనిట్. తాజాగా ట్రైడెంట్ హోటల్లో మరో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసుకుంది చిత్ర బృందం. ఈ క్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మరోసారి ఆ రిపోర్టర్ కామెంట్స్ ను గుర్తుచేసుకున్నట్టు ఉన్నాడు.

‘ ‘క’ సినిమా గురించి మొదటి నుండి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. నా నమ్మకం 1 పర్సెంట్ అయితే… ఈ సినిమా ఆడుతుందా అనేవాళ్ళు 90 శాతం పైగా ఉండేవారు. కానీ మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ‘క’ మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే. ‘ఆ హీరో మార్కెట్ ఇది, ఈ హీరో మార్కెట్ ఇది, ఇంకో హీరో మార్కెట్ ఇంతే’ వంటి అభిప్రాయాలూ తీసేయండి.

ఏ హీరో మార్కెట్ అయినా ఒక్క ఫ్రైడేతో మారిపోతుంది. అప్పుడు ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో కూడా కొంచెం కిందకి రావచ్చు. కాబట్టి.. మంచి సినిమాలు చేయాలి, తమదైన ఫ్రైడేని ఎంజాయ్ చేయాలి.. అని నేను కోరుకుంటున్నాను” అంటూ కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘లక్కీ భాస్కర్’ .. అక్కడ ఇంకొంచెం రావాలి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus