ఇంతలోనే మరొకటి.. అబ్బవరం స్పీడ్ మామూలుగా లేదుగా!

‘రాజావారు రాణిగారు’ ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ ‘సమ్మతమే’ .. ఇక ఈ మధ్యనే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి సినిమాలతో హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు కిరణ్ అబ్బవరం. మరికొద్ది రోజుల్లో ‘మీటర్’ అనే సినిమా కూడా రిలీజ్ కానుంది. ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ మధ్యే రిలీజ్ అయ్యింది. మాస్ ఆడియన్స్ టార్గెట్ ‘మీటర్’ సినిమా రూపొందించినట్టు టీజర్ స్పష్టం చేసింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మాతలు కాబట్టి ఆ సినిమా నిలబడే అవకాశాలు ఉన్నాయి.

ఇంకోపక్క ‘రూల్స్ రంజన్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు కిరణ్. పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత. ఇప్పుడు మరో కొత్త సినిమాని కూడా లాంచ్ చేశాడు. ‘శివం సెల్యులాయిడ్స్’ బ్యానర్ పై ‘ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్-2’ ఈ కొత్త చిత్రం రూపొందింది. ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశ్వ‌క‌రుణ్ ద‌ర్శ‌కుడు. ఇతనికి ఇదే మొదటి చిత్రం. రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రారంభమైంది.

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్టగా, ప్ర‌ముఖ నిర్మాత‌లు ద‌గ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.ర‌త్నం కెమెరా స్విచాన్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ కు కె.ఎస్.రామారావు, జెమిని కిర‌ణ్‌, శిరీష్, వ‌ల్ల‌భ‌నేని వంశీ, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోద‌ర‌ప్ర‌సాద్, కె.కె.రాధామోహ‌న్, బెక్కెం వేణుగోపాల్, ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌ వంటి బడా నిర్మాతలు హాజరయ్యారు. ఇంత మంది పెద్ద దర్శకులు హాజరయ్యారు అంటే కిరణ్ లైనప్ ఇంకా పెద్దగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈరోజు ప్రారంభమైన చిత్రం షూటింగ్ మార్చి నెలలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus