కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, కిర‌ణ్ అబ్బ‌వ‌రం కాంబినేష‌న్ లో “నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని మొద‌టి లుక్ విడుద‌ల‌‌

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు, అజాత‌శత్రువు అయిన కీర్తిశేషులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో కార్తిక్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సూప‌ర్‌హిట్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల ‌హృద‌యాల్లో కుటుంబ‌స‌భ్యుడిగా పేరు సంపాదించుకున్న‌ కిరణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

Click Here To Watch

ఈ ఆడియోని ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. తెలుగు సినిమా ద‌ర్శ‌క లెజెండ్ కోడి రామ‌కృష్ణ గారు సమ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. కోడి రామ‌కృష్ణ గారు చిత్రాలన్ని ఫ్యామిలీ అంతా థియాటర్ కి పిక్నిక్ గా వెళ్ళి చూసేవారు. ఇప్ప‌టికీ టీవి లో ఆయ‌న చిత్రాలు వ‌స్తున్నాయంటే ఫ్యామిలీ అంతా కూర్చిని చూస్తుంటారు. అలా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఆయ‌న బాగా కావాల్సిన‌వాడిగా వారి కుటుంబ‌సభ్యుడిగా మారిపోయారు. అలాంటి తెలుగు ద‌ర్శ‌కుడి పెద్ద కుమార్తె దివ్య దీప్తి, అలాగే మంచి చిత్రాలు చేస్తూ ప్ర‌తి ప్రేక్ష‌కుడికి బాగా కావాల్సిన వాడిలా కిర‌ణ్ అబ్బ‌వ‌రం క‌లిసిపోవ‌డం, ఈ చిత్ర కథ కూడా అన్ని ఎమోష‌న్స్ తో రావ‌డం తో ఈ చిత్రానికి నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని అనే టైటిల్ ని ఖ‌రారు చేసారు.

కోడి రామ‌కృష్ణ గారి దివ్య ఆశిస్సుల‌‌తో టైటిల్ ని ఈరోజు ఎనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. ఈ చిత్రానికి సంభందించిన మొద‌టి లుక్ ని కూడా విడుదల చేశారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ల‌వ‌ర్ బాయ్ లుక్ చూసిన ప్రేక్ష‌కులు ఒకే సారిగా మాస్ క‌మ‌ర్షియ‌ల్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాడు. టాలీవుడ్ లో వున్న క‌మ‌ర్షియ‌ల్ హీరోల స‌ర‌స‌న చేరేలా ఈ లుక్ వుండ‌టం విశేషం. ఈ సినిమాకి సంబందించిన ఎక్సైట్‌మెంట్ న్యూస్ మ‌రి కొన్ని రొజుల్లో తెలియ‌జేస్తారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus