Kantara: కిరణ్ అబ్బవరం ట్వీట్ పై మండిపడుతున్న నెటిజన్లు..

కన్నడ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ‘కాంతార’ మూవీ సెకండ్ వీక్ లోకి ఎంటరైపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుందీ చిత్రం. థియేటర్లకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. అలాగే సినిమా చూసి, వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభ, కర్ణాటకలో అంతరించిపోతున్న ప్రాచీన కళ గురించి రిషబ్ చూపించిన విధానం గురించి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.

రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘కాంతార’ మూవీ చూశాడు. సినిమా మీద తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో షేర్ చేశాడు. అయితే కిరణ్ పోస్ట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘నువ్వు సినిమాలు చెయ్యడం మానేయ్ బ్రో’ అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ కిరణ్ ఏమని కామెంట్ చేశాడు?.. ఏంటా సంగతి?.. చూద్దాం.. ‘కాంతార’ సినిమా చూసిన తర్వాత.. ‘‘నేను చిన్నప్పటి నుంచి మా ఊరిలో చూసిన కల్చర్ ని స్క్రీన్ పైన చూడడం చాలా బాగా అనిపించింది ’’..

అంటూ ఈ ఒక్కమాట పోస్ట్ చేశాడు. ఇందులో తప్పేమీ లేదు.. కిరణ్ ని తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు.. కానీ నెటిజన్లు మాత్రం కావాలనే కిరణ్ ని పర్సనల్ గా టార్గెట్ చేసినట్టే ట్రోల్స్ చేస్తున్నారు.. ‘‘నువ్వు కూడా ప్రస్తుతం చేసే రోత మూవీస్ ఆపేసి కొత్తగా ట్రై చెయ్ అన్నా.. అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది నీకు’’ అని సలహా ఇస్తూనే.. ‘‘గ్రేట్ పాన్ అన్నా, సినిమాలు ఎప్పుడు ఆపేస్తావన్నా?’’.. ‘‘నీది రాయచోటి కదా బ్రో.. ‘కోలం’ కర్ణాటక బోర్డర్ లో కదా జరిగేది..

అసలు ఇది మన సైడ్ కల్చర్ కాదు కదా.. ఇంటర్నేషనల్ స్కూల్ కదా అలానే ఉంటుంది’’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘సినిమా గురించి కిరణ్ బ్యాడ్ గా ఏం చెప్పలేదు కదా.. మీరు కావాలనే అతణ్ణి టార్గెట్ చేస్తున్నారు’’ అని కిరణ్ ట్వీట్ ని ఇన్ స్టా పేజీలో పోస్ట్ చేసిన వాళ్లపై కూడా మండిపడుతున్నారు నెటిజన్లు..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus