Kishkindhapuri Review in Telugu: కిష్కింధపురి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Hero)
  • అనుపమ పరమేశ్వరన్ (Heroine)
  • తనికెళ్లభరణి, ప్రేమ, హైపర్ ఆది, శాండీ (Cast)
  • కౌశిక్ పెగళ్లపాటి (Director)
  • సాహు గారపాటి (Producer)
  • చైతన్ భరద్వాజ్ (Music)
  • చిన్మయ్ సలాస్కర్ (Cinematography)
  • నిరంజన్ (Editor)
  • Release Date : సెప్టెంబర్ 12, 2025
  • షైన్ స్క్రీన్స్ (Banner)

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో “చావు కబురు చల్లగా” ఫేమ్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “కిష్కింధపురి”. హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ మంచి అంచనాలు నమోదు చేసింది. ఆ అంచనాలను సినిమా అందుకోగలిగిందా? ప్రేక్షకుల్ని మెప్పించగలిగిందా? బెల్లంకొండకు హిట్ వచ్చిందా? అనేది చూద్దాం..!!

Kishkindhapuri Movie Review

కథ: 1989లో మూసుకుపోయిన సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ లో ఉద్యోగులందరూ ఒకేసారి చాలా దారుణంగా చనిపోతారు. దాంతో ఆ స్టేషన్ మూతబడుతుంది.

కట్ చేస్తే.. కిష్కింధపురి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న భయానకమైన లేదా దెయ్యాలు తిరుగుతున్నాయని అందరూ అనుకునే స్థలాలకి జనాల్ని తీసుకెళ్లి ఘోస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంటారు రాఘవ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్). అలా ఒక సందర్భంలో సువర్ణమాయ స్టేషన్ కి వస్తారు.

ఆ తర్వాత ఏమైంది? అక్కడ ఎలాంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆ స్టేషన్ లో ఏం జరిగింది? వాటిని రాఘవ ఎలా అధిగమించాడు? వంటి ప్రశ్నలకు సమాధానం “కిష్కింధపురి” చిత్రం.

నటీనటుల పనితీరు: చిత్రబృందం ఇప్పటివరకూ చూపించని నటుడు ఒకడున్నాడు సినిమాలో. అతడి పెర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలైట్. అతను ఎవరు అనేది రేపటికల్లా అందరికీ తెలిసిపోతుంది.

బెల్లంకొండ డైలాగ్ డెలివరీలో స్పష్టత ఉంటుంది, అతడి వాచకం బాగుంటుంది. అయితే.. అందులో జనాలని భయపెట్టే స్థాయి టోన్ మ్యానేజ్మెంట్ లేదు. ఆ విషయంలో బెల్లంకొండ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నటుడిగా చాలా బెటర్ అయ్యాడు. ఇంకా ఇంప్రూవ్ మెంట్ అవసరం.

అనుపమకి చాలా సింపుల్ పాత్ర ఇది. సరదాగా చేసేసింది. నటి ప్రేమను చాలారోజుల తర్వాత మంచి పాత్రలో చూసాం. తనికెళ్లభరణి పాత్ర బాగుంటుంది. హైపర్ ఆది పంచులు మొదట్లో కాస్త నవ్వించాయి.

మిగతా నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు కౌశిక్ రాసుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ట్రైన్ ఇంజన్ సీక్వెన్స్ కానీ, తనికెళ్లభరణి క్యారెక్టర్ ట్విస్ట్ కానీ భలే వర్కవుట్ అయ్యాయి. అయితే.. చాలా విషయాలని విజువల్ గా చూపించకుండా, మాటల్లో చెప్పేయడం అనేది ఎందుకో సింక్ అవ్వలేదు. అలాగే.. మరీ ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వదిలేశాడు. ఇక సెకండ్ పార్ట్ కి లీడ్ గా ఉంటుందని ఇచ్చిన ఓపెన్ ఎండింగ్ సంతృప్తినివ్వలేకపోయింది. సీన్ కంపోజిషన్స్ విషయంలో మాత్రం కౌశిక్ ను మెచ్చుకోవాల్సిందే. అయితే.. ఆ సన్నివేశాలని ఒద్దికగా పేర్చడంలో మాత్రం తడబడ్డాడు. ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి వెన్నుముకలా నిలిచింది. సినిమా కాస్త వీక్ అవుతుంది అనుకున్న ప్రతి తరుణంలో తన నేపథ్య సంగీతంతో నిలబెట్టాడు.

CGI ఇంకాస్త బెటర్ గా ఉండొచ్చు. ఓపెనింగ్ లో వచ్చే కోతుల ఫైట్ సీన్ కానీ, మధ్యలో వచ్చే దెయ్యం సీన్స్ కానీ క్వాలిటీ పరంగా కాస్త ఇబ్బందిపెడతాయి. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.

విశ్లేషణ: హారర్ సినిమాలతో ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఎలాంటి కథనైనా, ఎలాంటి పాత్రనైనా కాస్త ఎంగేజింగ్ గా చెప్పగలిగితే చాలు. మిగతాది హారర్ ఎలిమెంట్స్ చూసుకుంటాయి. దర్శకుడు కౌశిక్ కొంతమేరకు ఆడియన్స్ ను ట్విస్టులతో ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. క్లోజర్ ఇచ్చిన విధానంలో ఇంకాస్త జాగ్రత్తపడాల్సింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ను ఓ మోస్తరుగా అలరించే చిత్రం “కిష్కింధపురి”.

ఫోకస్ పాయింట్: టైంపాస్ హారర్ థ్రిల్లర్!

రేటింగ్: 2.5/5

 

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus