ఈ ముద్దు మధురం

  • April 12, 2018 / 01:32 PM IST

ఒక తల్లి తొలిసారి తన కన్నబిడ్డను ఒడిసిపట్టుకొని బగ్గపై పెట్టే ముద్దులో ఆప్యాయత ఉంటుంది, అలాగే కొడుకు ప్రయోజకుడైయ్యాక తండ్రి కావలించుకొని నుదురుపై పెట్టే ముద్దులో సంతృప్తి ఉంటుంది, తనకు తోడుగా నడుస్తున్న మానవడిని అమ్మమ్మ/తాతయ్యలు తలపై పెట్టే ముద్దులో అభిమానం ఉంటుంది, తాను ప్రేమించిన అమ్మాయికి ప్రియుడు అధరాలపై ఇచ్చే చుంబనంలో ప్రేమ ఉంటుంది. ఇలా మన జీవితంలోని ప్రతి ముద్దుకి ఒక కారణం, సందర్భం ఉన్నట్లే.. మన సినిమాల్లోని కొన్ని ముద్దు సన్నివేశాల్లో కూడా అద్భుతమైన అర్ధం ఉంటుంది. అలా మన సినిమాల్లోని ముద్దైన కొన్ని సందర్భాలు..!!

1) తొలిప్రేమ వరుణ్ తేజ్-రాశీఖన్నాల నడుమ ఈ సినిమాలో రెండు అధర చుంబన సన్నివేశాలుంటాయి. ఆ రెండు సినిమాలూ చూడ్డానికి స్వచ్ఛంగా, ముద్దుగా ఉంటాయే తప్ప భూతద్దం పెట్టి వెతికినా అసభ్యత అనేది కనిపించదు. అది దర్శకుడు వెంకీ అట్లూరి ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం యొక్క గొప్పతనం. రెండు సన్నివేశాల్లోనూ అమాయకత్వం, చిలిపిదనం కనిపిస్తుందే తప్ప కామం అనేది కనిపించదు. అందుకే ఆ ముద్దుతో చిత్రాన్ని ముగించినా థియేటర్లో చెప్పట్లు కొట్టారు కుటుంబ ప్రేక్షకులు కూడా.

2) గీతాంజలి 90వ దశకంలో పుట్టిన ప్రెజంట్ జనరేషన్ ఎవరికీ కనీసం చడ్డీలేసుకొనే వయాసొచ్చేవరకూ “గీతాంజలి” చిత్రంలో లిప్ లాక్ సీన్ ఉందనే విషయం కూడా తెలియదు. మణిరత్నం 1989లోనే “గీతాంజలి” చిత్రంలో నాగార్జున-గిరిజిలు ఒకరిపై ఒకరు చెప్పుకోలేనంత ప్రేమను అధర చుంబనం ద్వారా వ్యక్తపరుచుకుంటారు. దాదాపు రెండు నిమిషాలు ఉండే ఈ సన్నివేశాన్ని అప్పటి సభ్యసమాజం తన్మయత్వంతో చూసిందే కానీ సెక్సువల్ యాంగిల్ లో ఆ సన్నివేశాన్ని చూడడానికి ఎవరికీ మనసు కూడా రాదు.

3) రంగస్థలం చెబితే వినబడవు, చెప్పకుండా అర్ధం చేసుకొనేంతలా ఎదగనూలేదు. ఏమని చెప్పగలదు, ఎంతని వివరించగలదు. అందుకే రామలక్ష్మి గట్టిగా చిట్టిబాబుకి ఒక స్ట్రాంగ్ లిప్ కిస్ ఇస్తుంది. దాంతో అప్పటివరకూ చిట్టిబాబు బుర్రలో ఆలోచనలన్నీ పటాపంచలైపోయి రామలక్ష్మి తనను ఎంత ఘాడంగా ప్రేమిస్తుందో అర్ధమవుతుంది. ఈ సన్నివేశాన్ని ఇంత అందంగా రాసుకొన్న, అంతే అందంగా స్క్రీన్ పై ప్రెజంట్ చేసిన సుకుమార్ కళాత్మకతను మెచ్చుకోవాల్సిందే.

4) ఆర్య 2మనసులో మోయలేనంత ప్రేమ, చెప్పకపోతే చచ్చిపోతానేమో అని భయమేసేంత ప్రేమ, మాటలు రావట్లేదు, నోరు పెగలట్లేదు. పక్కనే ఇష్టపడిన అమ్మాయి.. ఏ ప్రేమికుడైనా ఏం చేయగలడు. వెంటనే తాను ప్రేమించిన అమ్మాయి అధరాలను వీలైనంత గట్టిగా చుంబించడం తప్ప. ఆర్య అదే పని చేశాడు. గీతను పట్టుకొనే ధైర్యం కూడా లేకపోవడంతో కేవలం తన పెదాలతో గీత పెదాలను ముడి వేశాడు. అతడి చర్యకు ఆమె ఆశ్చర్యపోయి స్థానువైపోయిందే తప్ప కదలలేదు, మెదలలేదు.

5) మనంతనను ఎంతగానో ప్రేమిస్తున్న యువకుడ్ని తాను అసహ్యించుకొంటున్న విషయం అతడికి తెలుసున్న విషయం ఈమెకూ తెలుసు. కానీ.. ఒక్కసారిగా తన ప్రేమను హిమాలయమంత గొప్పగా ప్రదర్శించిన ప్రేమికుడి ప్రేమను చూసి చలించిపోయింది. అసహ్యం బదులు గుండెల్నిండా ప్రేమ నిండిపోయింది. ఆ తరుణంలో అతడికి తన ప్రేమను మాటలతో చెప్పడం కుదరదు, మాటలు రావు కూడా. వెంటనే అతడి మొహాన్ని తన చేతులతో దగ్గరకి తీసుకొని అధరాలను అందుకొంది. “మనం” సినిమాలో చైతన్యను సమంత ముద్దు పెట్టే సన్నివేశం చూస్తే అందరికీ స్వచ్చమైన ప్రేమ అంటే ఏమిటో అర్ధమవుతుంది.

6) 7/జి బృందావన కాలనీ ఎవరూలేని ఫ్రెండ్ రూమ్, పక్కనే ప్రేమించిన అమ్మాయి ఉంది. ఏ కుర్రాడికైనా ఇంతకు మించిన ఆనందాన్నిచ్చే తరుణం మరొకటి ఏముంటుంది. అయితే రవికి తన అనితను తాకాలనే ఆత్రం తప్ప ఏదో చేసేయాలనే అత్యాశ లేదు. ఆ సందర్భంలో ఇద్దరూ అనుకోకుండా ముద్దు పెట్టుకొంటారు. ఆ సన్నివేశంలో అనిత కంటే రవి ఎక్కువ కంగారుపడడం మనం చూడొచ్చు. ఒక అమాయక ప్రేమికుడి మనస్తత్వం ఆ సన్నివేశంలో మనకు అర్ధమవుతుంది. అందుకే సెల్వరాఘవన్ ను డైరెక్టర్ ఆఫ్ సెన్సిబిలిటీస్ అంటుంటారు.

7) ఏమాయ చేసావే కుక్కపిల్లలకు కూడా “ఐ లవ్ యూ” చెబుతున్న రోజులివి. అలాంటిది తన ప్రేమలోని ఘాడత్వం ప్రేయసికి తెలియజేయాలంటే ఏకైక మాత్రం చుంబించడం. అదే చేస్తాడు కార్తీక్. జెస్సీకి తన ప్రేమలోని లోతు అర్ధమవ్వాలని ట్రైన్ లో చుట్టూ ఎవరన్నా చూస్తున్నారన్న భయం కూడా లేకుండా జెస్సీ పెదాలపై ఘాడంగా చుంబిస్తాడు. అప్పుడు అర్ధమవుతుంది జెస్సీకి కార్తీక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో.

8) అర్జున్ రెడ్డిసినిమా చూశాక అందరూ “రేయ్ సినిమాలో అన్నీ ముద్దులున్నాయి, ఇన్ని ఉన్నాయి” అని లెక్కలు పెట్టారే తప్ప, దర్శకుడు ఆ ముద్దు ద్వారా చెప్పాలనుకొన్న విషయాన్ని చాలా తక్కువమంది అర్ధం చేసుకొన్నారు. ప్రీతిని మొదటిసారి హాస్టల్ లో కలిసిన అర్జున్ ఆమె చెంపపై ముద్దు పెడతాడు. ఆ ముద్దులో “తను నాది” అని అందరికీ వ్యక్తపరచాలనే భావన కనిపిస్తుంది. అలా ప్రతి ముద్దులోనూ ప్రేమ మాత్రమే ఉంటుంది.

9) అదృష్టంతన జీవితంలో అప్పటివరకూ అన్నీ దరిద్రాలే చూసిన ఒక యువకుడికి ఉన్నట్లుంది ఒక అందాల రాశి కనబడుతుంది. చూడగానే ప్రేమలో పడిపోతాడు. తన చుట్టూ వందమంది ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ఆమెతో మాట్లాడడానికి కూడా మాటలు రాక ఆమెకు ఊపిరాడనంత గట్టిగా ముద్దు పెట్టేస్తాడు. పెట్టేశాక తెలుసుకొంటాడు తాను ఎంత తప్పు చేశానో. ‘అదృష్టం” సినిమాలో ఆ సన్నివేశం అప్పటికి పెద్దగా అర్ధం కాలేదు కానీ.. ఇప్పుడు చూస్తే మాత్రం “ఇంత డెప్త్ ఉందా” అనిపిస్తుంది.

10) చందమామ కథలుయంగ్ హీరోహీరోయిన్లు ముద్దులు పెట్టుకుంటుంటూనే తేడాగా చూస్తున్న తరుణంలో అయిదు పదుల వయసు పైబడ్డ నరేష్-ఆమని “చందమామ కథలు” సినిమాలో లిప్ లాక్ సీన్ లో యాక్ట్ చేశారట అనేది విషయం తెలిసాక చాలామంది నవ్వుకొన్నారు. కానీ.. తాను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయిన యువతిని ఏళ్ల తర్వాత కలిసిన మనిషి ఆమెను కామంతో కాక తన్మయత్వంతో ముద్దాడతాడు. ఆ సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది.

11) వరుడుపెద్దలు కుదిర్చిన పెళ్లి, కనీసం అప్పటివరకూ ఒకరి ఫోటోలు కూడా మరొకరు చూసుకోలేదు. మొదటిసారి పెళ్లి పీటల మీదే చూసుకొన్నారు. కానీ.. పెళ్ళైన మరుక్షణం విడిపోతారు. కానీ.. తన కోసం వందల మందిని ఎదిరించి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న భర్తకి తన ప్రేమను ఏ విధంగా తెలియజేయాలో తెలియక అతగాడు నిదురబోతున్నప్పుడు అతడి అధరాలను ఘాడంగా చుంబిస్తుంది.

12) పోతురాజుఈమధ్య కొడుకు ఎంగిలి తినడానికి తల్లి కూడా ఇబ్బందిపడిపోతుంది. అయితే.. ఆ ఎంగిలిలోనే ప్రేమ దాగి ఉంటుంది. “పోతురాజు” సినిమాలో కమల్ హాసన్ తాను ప్రేమిస్తున్న అభిరామికి ముద్దిస్తాడు, అప్పుడు ఆమె మూతి తుడుచుకుంటుంది. వెంటనే కమల్ “ఏంది మూతిని తుడుచుకుంటాండావ్, ఇష్టం లేదా?” అని అడిగితే, వెంటనే అభిరామి “నేనన్నానా?” తిరిగి ప్రశ్నించి కమల్ కింది పెదవి ఎంగిలిని తీసుకొని తన ముద్దాడి పెదాలకు రాసుకుంటుంది. ఆ సన్నివేశంలో ఎంతటి ప్రేమ, అమాయకత్వం, సహజత్వం ఉన్నాయి.

13) ఒన్ నేనుక్కడినేతనని వదిలి వెళుతున్న ప్రియుడికి ముద్దు పెట్టాలన్న ఆలోచన మెదడులో ఉంటుంది కానీ.. బయటకి మాత్రం చెప్పలేదు. అది అర్ధం చేసుకొన్న గౌతమ్ వచ్చి నిజంగానే ముద్దు పెట్టుకొంటాడు. అప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం చూసి మురిసిపోవడం ప్రేక్షకుల వంతయ్యింది.

14) బ్రహ్మోత్సవంనీతో ఉండలేను, నీకోసం తిరిగిరాను అని ప్రేయసి చెప్పి వెళ్లిపోయే సందర్భం.. కారణం చెప్పేసింది కానీ.. వెళ్ళబుద్ది కావడం లేదు. తన గుర్తుగా అతడికి ఏదో ఇవ్వాలనే ఆశ. ఏ ఆడపిల్లైనా ముద్దు తప్ప ఏమిచ్చుకోగలదు. అందుకే కాజల్ కూడా మహేష్ బాబుకు గట్టిగా ఓ ముద్దిచ్చి వదిలేస్తుంది. వెళ్లిపోతున్నాను ఈ ప్లేస్ నుంచి, జీవితం నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతుంది.

15) కుమారి 21Fఎక్కడైనా అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయికి ముద్దు పెట్టాలని, ఆ ముద్దు జీవితాంతం గుర్తుండిపోవాలనుకొంటాడు. కానీ.. “కుమారి 21F” లో హెబ్బా పటేల్ తాను తొలిచూపులో ఇష్టపడిన రాజ్ తరుణ్ కి మాంచి ముద్దివ్వాలనుకుంటుంది. అప్పుడే తాగేసి బయటకు రావడంతో నోటి నుంచి దుర్వాసన రాకూడదు అనుకోని ఒక హాల్స్ కూడా వేసుకొని మరీ తన జీవితంలోని మొదటి ముద్దుని అతడికి ఇస్తుంది. ఈ సీన్ లో సుకుమార్ అమ్మాయి ఆనందాన్ని, ప్రేమను స్వచ్ఛంగా, సహజంగా చూపించిన తీరు అభినందనీయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus