`కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త` సెన్సార్ పూర్తి, మార్చి 3న రిలీజ్‌

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా….

నిర్మాత రామ‌బ్ర‌హ్మం సుంక‌ర మాట్లాడుతూ – “2016లో హిట్ అయిన చిత్రాల్లో `ఈడోర‌కం-ఆడోర‌కం` త‌ర్వాత ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 3న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్ త‌రుణ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాత్ర‌లో న‌టించాడు. అనేక మ‌లుపుల‌తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ సినిమా ట్రైల‌ర్‌తో పాటు పాట‌ల‌ను కూడా రిలీజ్ చేశాం. హంస‌నందిని న‌టించిన స్పెష‌ల్ సాంగ్ `నా పేరే సింగ‌పూర్ సిరిమ‌ల్లి..` సాంగ్‌ను నిన్న‌నే రిలీజ్ చేశాం. ప్ర‌తి పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. మ్యూజిక్ చార్ట్స్‌లో ముందు వ‌రుస‌లో నిలుచుకుంది. సాయిమాధ‌వ్‌ గారి సంభాష‌ణ‌లు, రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ, ఎం.ఆర్‌.వ‌ర్మ ఆర్ట్ వ‌ర్క్ సినిమాకు ప్ల‌స్ కానున్నాయి. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో న‌టించారు“ అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus