ఎట్టకేలకు కొబ్బరి మట్ట ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది

సరిగ్గా నాలుగేళ్ల క్రితం “స్పూఫ్” అంటే ఇలా కూడా చేయొచ్చా? అని ప్రేక్షకులు మాత్రమే కాదు చాలా మంది ఫిలిమ్ మేకర్లు కూడా ఆశ్చ్యర్యపోయేలా చేసిన చిత్రం “హృదయకాలేయం”. “సంపూర్ణేష్ బాబు” అనే సగటు వ్యక్తిని స్టార్ కమెడియన్ కమ్ హీరోను చేసిన ఈ చిత్రం సాయి రాజేష్ అలియాస్ స్టీవెన్ శంకర్ అనే ప్రతిభావంతుడ్ని కూడా పరిశ్రమకు పరిచయం చేసిందీ చిత్రం. ఆ తర్వాత పదుల సంఖ్యలో ఈ తరహాలో సినిమాలోచ్చినప్పటికీ “హృదయ కాలేయం” రేంజ్ హిట్ కొట్టలేకపోయాయి. అంతకుమించిన స్పూఫ్ కామెడీతో మరోమారు జనాల్ని ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమయ్యారు సాయి రాజేష్ & సంపూర్ణేష్ బాబు టీం.

మొదటి సినిమా “హృదయ కాలేయం”లో ఒక్క పాత్రతోనే కడుపుబ్బ నవ్వించిన సంపూర్ణేష్ బాబు “కొబ్బరి మట్ట”లో ఏకంగా త్రిపాత్రాభినయం చేశాడు. “హృదయ కాలేయం” దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రానికి కేవలం నిర్మాతగా వ్యవహరించనుండగా.. రూపక్ రోనాల్డ్ సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్, 2015లో మొదలైన ఈ చిత్రం కారణాంతరాల వలన షూటింగ్ సరిగ్గా అవ్వక, షెడ్యూల్స్ ప్లానింగ్ ప్రకారం సెట్ అవ్వక చాలా ఇబ్బందులు పడింది. ఇన్నాళ్ల తర్వాత మొత్తానికి ఫైనల్ కాపీ సిద్ధమైంది. డి.టి.ఎస్ మిక్సింగ్, డి.ఐ మినహా షూటింగ్ పూర్తైనట్లు నిర్మాత సాయిరాజేష్ కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ “హృదయ కాలేయం” రేంజ్ లో పబ్లిసిటీ చేసి హైప్ వచ్చాక సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమా ఈ ఏడాది వస్తుందా లేక వచ్చే ఏడాదా అనేది సినిమాకి వచ్చే క్రేజ్ ను బట్టి ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus