“పసివాడి ప్రాణం”, “ఖైదీ”, “అభిలాష”, “అత్తకు యముడు అమ్మాయికి మొగుడు”, “కొండవీటి దొంగ”.. చిరంజీవి ని మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు ఇవి. 1980 వ దశకంలో వచ్చిన ఈ చిత్రాలన్నింటికీ ఒకరే డైరక్టర్ .. ఆయనే కోదండ రామి రెడ్డి. ఈయన చిరుతో కలిసి 20 కు పైగా సినిమాలు తీశారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.
చిరంజీవితో చివరగా ముఠామేస్త్రి మూవీకి కోదండ రామి రెడ్డి పని చేశారు. ఆ తర్వాత వీరి కలయికలో సినిమా రాలేదు. చిరంజీవి రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ దర్శకుడు ఇక చిరుతో సినిమా ప్రస్తావన తీసుకురాలేదు. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ కత్తిలాంటోడు సినిమాతో మనముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై కోదండ రామి రెడ్డి ని అభిప్రాయం కోరగా.. “అభిమానులు చిరంజీవిని యాక్షన్ ఎంటర్ టైనర్ జాన్రా లో చూసేందుకు ఇష్టపడతారు.
అలాంటి కథనే చిరు ఎంచుకొని ఉంటారు” అని చెప్పారు. తనకి మాత్రం ఇప్పుడు చిరుని డైరక్ట్ చేసే అవకాశం వస్తే పూర్తి ఎంటైర్ టైనర్ మూవీ చేస్తానని వెల్లడించారు. చిరంజీవికి, కోదండ రామి రెడ్డి మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఈ డైరక్టర్ తో అన్నయ్య సినిమా చేస్తారా ? లేదా ? అనేది కాలమే నిర్ణయించాలి.