Jr NTR: ఎన్టీఆర్ గురించి కోలీవుడ్ యాంకర్ ఎమోషనల్ పోస్ట్.. కల నెరవేరిందంటూ?

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా తన యాక్టింగ్ స్కిల్స్ తో జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చరణ్ (Ram Charan) , తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ తమిళ వెర్షన్ కలెక్షన్ల విషయంలో అదరగొట్టిందనే సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైలో దేవర (Devara) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అంజన రంగన్ ఈ ప్రెస్ మీట్ కు యాంకర్ గా వ్యవహరించారు.

Jr NTR

తమిళనాడులోని టాప్ యాంకర్లలో అంజన రంగన్ ఒకరు కాగా సోషల్ మీడియాలో అంజన రంగన్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి కామెంట్లు చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తారక్ తో కలిసి దిగిన ఫోటోలను అంజన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేటికి 16 సంవత్సరాలు పూర్తైందని నేను 17వ సంవత్సరంలోకి ఒక డ్రీమ్ లాంటి ఈవెంట్ తో అడుగు పెట్టానని ఆమె పేర్కొన్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చాలా మంచి వ్యక్తి అని ఇన్ని సంవత్సరాలుగా తారక్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి ఇష్టపడ్డానని డైరెక్ట్ గా ఎప్పుడు చూస్తానా అని ఆరాటపడ్డానని నా స్పెషల్ డే రోజున దేవుడు నాకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడంటూ అంజన రంగన్ ఎమోషనల్ అయ్యారు. అంజన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

అంజన ట్విట్టర్ పోస్ట్ కు ఏకంగా 17200 లైక్స్ వచ్చాయి. గతంలో అంజన రంగన్ హోస్ట్ గా వ్యవహరించిన టాలీవుడ్ హీరోల సినిమాలు సక్సెస్ సాధించాయని అదే విధంగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దేవర నామ సంవత్సరం అంటూ మేకర్స్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది.

నెట్టింట వైరల్ అవుతున్న కూలీ క్రేజీ సీన్.. నాగ్ అదరగొట్టాడుగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus