Kollywood: తమిళ చిత్రపరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంటుందా? హీరోలు ఓకే అంటారా?

సినిమా పరిశ్రమలో నిర్ణయాలు తీసుకోవడమే కష్టం.. ఆ నిర్ణయాలను అమలు చేయడం ఇంకా కష్టం. దీనికి నిలువెత్తు ఉదాహరణ టాలీవుడ్‌లో ఓటీటీల రిలీజ్‌ల గురించి కొన్ని నెలల క్రితం తీసుకున్న డెసిషన్‌. అయితే దీనిని పెద్ద సినిమాలు కూడా పాటించడం లేదు. ఇక చిన్న సినిమాల సంగతి సరేసరి. ఇప్పుడు కోలీవుడ్‌లో ఓ పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అంతా రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు ఇవే టాక్‌ ఆఫ్‌ ది తమిళనాడు.

Kollywood

తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొన్ని సంచలన ప్రతిపాదనలు సిద్ధం చేసిందని సమాచారం. అవి అమలులోకి వస్తే అక్కడే కాదు ఇతర భాషల్లోనూ ప్రకంపనలు రావడం ఖాయం అని చెబుతున్నారు. ఎందుకంటే నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇకపై పూర్తి రెమ్యునరేషన్ ఒకేసారి అందదు. సినిమా లాభ నష్టాలను నిర్మాతతో కలసి పంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ మేరకు సినిమా అగ్రిమెంట్‌లోనే నిబంధనలు పెడతారు అని సమాచారం.

స్టార్ హీరోల సినిమాలు ఓటీటీకి రావడానికి థియేటర్లలో రిలీజ్‌కు గ్యాప్‌ ఉండేలా కూడా ప్లాన్‌ చేస్తున్నారట. టాలీవుడ్‌లో అమలులలోకి ఉండి ఎవరూ పాటించని విధానమే అక్కడా అనుకుంటున్నారు. ఆ లెక్కన పెద్ద హీరోల సినిమాలకు ఎనిమిది వారాలు. ఓ మోస్తారు స్టార్‌ హీరోల సినిమాలకు ఆరు వారాలు, చిన్న హీరోల సినిమాలకు నాలుగు వారాలు గ్యాప్‌ ఉండాలి అనేది లేటెస్ట్ నిర్ణయం. ఈ పాయింట్‌ను సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పాటించాలి అని అంటున్నారు.

టాలీవుడ్‌ గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొస్తుంది అని వార్తలొచ్చిన సొంత టికెట్ బుకింగ్‌ యాప్‌ / వెబ్‌సైట్‌ ఆలోచనను ఇప్పుడు తమిళనాడు సినిమా పరిశ్రమ చేసిందట. అయితే ఈ పాయింట్లన్నీ దాదాపు గతంలో తెలుగు సినిమా పరిశ్రమకు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన ఆలోచనలే. కానీ ఏవీ వర్కవుట్‌ కాలేదు. ఎందుకంటే స్టార్‌ హీరోలు ఇలాంటి షేరింగ్‌, పార్ట్‌ పేమెంట్‌కి ముందుకు రావడం కష్టం. ఇక ఓటీటీలే రాజ్యమేలుతున్న ఈ తరుణంలో రిలీజ్‌కి ఎక్కువ గ్యాప్‌ దొరకడం కష్టమే. ఇక టికెట్‌ యాప్‌ సంగతి సరేసరి.

‘శివ’ రీ రిలీజ్.. నాగ్ ఆ ఛాన్స్ మిస్ చేశారా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus